Post office Scheme: దేశంలో ఇప్పటికీ మారుమూల ప్రజలకు సైతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంస్థ పోస్టాఫీసు. దీని ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సైతం అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజలకోసం అనేక పొదుపు పథకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ గురించే. ఇందులో మీరు డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అలాగే మనీబ్యాక్ స్కీమ్ ద్వారా ప్రతినెల స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు సదుపాయం సైతం అందుబాటులో ఉంది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ కావటం వల్ల పూర్తిగా పెట్టుబడి పెట్టిన మెుత్తానికి రక్షణ ఉంటుంది. ఈ ఖాతా ద్వారా ప్రతినెల వడ్డీని పొందుతూ ఉంటారు.

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతాను పోస్టాఫీసులో సింగిల్ లేదా జాయింట్ మోడ్‌లలో తెరవవచ్చు. దీనిని కుటుంబంలోని భార్య, సోదరుడు లేదా పిల్లతో కలిసి తెరవొచ్చు. జాయింట్ ఖాతా వల్ల డిపాజిట్ చేసేందుకు గరిష్ఠ పరిమితి మెుత్తం పెరుగుతుంది. ఈ స్కీమ్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇంట్లోనే కూర్చుని రూ.5 లక్షలకు పైగా ఆదాయాన్ని ఎలాంటి రిస్క్ లేకుండా పొందవచ్చు. ఇందుకోసం స్కీమ్ కింద మీరు ఒకేసారి డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతినెల మీ పోస్టల్ ఖాతాలోకి రాబడిని పొందవచ్చు. మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ ప్రతినెల జమచేయబడుతుంది.
వ్యక్తిగత ఖాతా కింద రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. స్కీమ్ కింద నెలవారీ వడ్డీ రూపంలో 7.4 శాతం పొందవచ్చు. గరిష్ఠ పరిమితి 15 లక్షలు పెట్టుబడిగా పెడితే నెలకు రూ.9000 వడ్డీ రూపంలో పొందుతారు. అంటే ఏడాదికి దాదాపు రూ.1.10 లక్షలు. ఐదేళ్ల కాలంలో సురక్షితమైన పెట్టుబడి ద్వారా ఏకంగా రూ.5.50 లక్షల ఆదాయాన్ని ఎలాంటి రిస్క్ లేకుండానే అందుకోవచ్చు. వృద్దాప్య సమయంలో ఇది ఖచ్చితంగా మెరుగైన రాబడిని అందించే పెట్టుబడిగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications