IPO News: వచ్చే వారం మార్కెట్లోకి కొత్త ఐపీవో.. గ్రేమార్కెట్లో దుమ్మురేపుతోంది..

IPO News: ప్రస్తుతం మార్కెట్లో చాలా మంది ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అనేక ఐపీవోలు విజయవంతం కావటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది.

రానున్న వారంలో ఐపీవో పెట్టుబడిదారులకు ఒక మంచి అవకాశం ఉంది. అక్టోబర్ 26న పారగాన్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ తన ఐపీవో సబ్ స్క్రిప్షన్ ప్రారంభిస్తోంది. ఈ IPO 30 అక్టోబర్ 2023 వరకు ఇన్వెస్టర్ల కోసం తెరచి ఉండనుంది. ఈ క్రమంలోనే కంపెనీ ఐపీవోకు గ్రేమార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.

Know about Paragon Fine And Speciality Chemicals Limited IPO starting on 26 october

పారగాన్ ఫైన్ IPO ప్రైస్ బ్యాండ్ ధరను రూ.95 నుంచి రూ.100గా నిర్ణయించబడింది. కంపెనీ ఒక లాట్‌ పరిమాణాన్ని 1200 షేర్లుగా ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీ ఐపీవోలో పందెం వేయాలంటే రూ.1,20,000 అవసరం. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక్క లాట్ సబ్‌స్క్రయిబ్ చేసిన వారికి నవంబర్ 2, 2023లో షేర్ల కేటాయింపు ఉంటుంది. కంపెనీ షేర్లు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో రూ.55 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే పారగాన్ ఫైన్ ఐపీవో రూ.155 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

2004లో స్థాపించబడిన కంపెనీ కస్టమ్ సింథసిస్, కాంప్లెక్స్, డిఫరెన్సియేటెడ్ కెమిస్ట్రీతో కూడిన స్పెషాలిటీ కెమికల్ ఇంటర్మీడియట్‌ల తయారీ వ్యాపారంలో పాల్గొంటుంది. విభిన్నమైన భారతీయతో పాటు గ్లోబల్ కస్టమర్ బేస్ కోసం కంపెనీ ఫార్మా ఇంటర్మీడియేట్‌లు, ఆగ్రో ఇంటర్మీడియేట్‌లు, కాస్మెటిక్స్ ఇంటర్మీడియేట్‌లు, పిగ్మెంట్ ఇంటర్మీడియేట్‌లు, డై ఇంటర్మీడియేట్‌లను తయారు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+