Options Trading: చాలా మంది మార్కెట్లు పడిపోతున్న సమయంలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మంచి లాభాలను సంపాదించవచ్చని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఫిజికల్ షేర్లను కొనటంతో పాటు స్టాక్ ఆఫ్షన్ స్ట్రాటజీలను కూడా ఫాలో అవుతుంటారు. వీటిలో పెట్టుబడి తక్కువ అవసరం ఉండటంతో చాలా మంది ప్రస్తుతం వీటిపై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు.

మార్కెట్ మూమెంట్..
ఈ రోజుల్లో చాలా మంది స్టాక్ మార్కెట్లలోకి అనుభవం లేని ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సి విషయం ఏమిటంటే.. స్టాక్ ధరలు - బుల్లిష్, బేరిష్, న్యూట్రల్ అనే మూడు మూమెంట్ కలిగి ఉంటాయి. వార్తలతో సంబంధం లేకుండా ఫండమెంటల్స్ లేదా టెక్నికల్ మార్పుల కారణంగా స్టాక్స్ ధరలు బుల్లిష్, బేరిష్ లేదా న్యూట్రల్ ట్రెండ్‌ను అనుకరిస్తాయని తెలుసుకోవాలి.

ట్రెండ్స్ పనితీరు..
• బుల్లిష్ ట్రెండ్ అంటే మీరు ఒక స్టాక్ లేదా స్టాక్‌ల సెట్ ధరల్లో కదలికలు భారీగా పాజిటివ్ గా ఉండాలని ఇన్వెస్టర్ ఆశించటం. ఇలాంటి సందర్భంలో ఇన్వెస్టర్లు షేర్లను ఎక్కువగా కొనుగోలు చేయటానికి మెుగ్గు చూపుతున్నారని అర్థం. అంటే వారు లాంగ్ పొజిషన్‌లను కలిగి ఉన్నారని అర్థం చేసుకోవాలి
• బేరిష్ ట్రెండ్ అనేది మనం పైన మాట్లాడుకున్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇన్వెస్టర్ బేరిష్ మైండ్ సెట్ తో ఉన్నట్లయితే.. అతను సెల్లర్ గా ఉన్నట్లు అర్థం. అలాంటి వారు షార్ట్ పొజిషన్ తో షేర్లను విక్రయించటానికి సిద్ధంగా ఉంటారు.
• తటస్థ ధోరణిలో స్టాక్ లో పెద్దగా మెుమెంటం ఉండదు. అంటే అది బుల్లిష్ లేదా బేరిష్ కాదని అర్థం.

స్టాక్ ఆప్షన్ అంటే ఏమిటి?
స్టాక్ ఆప్షన్ అనేది ఒక నిర్దిష్ట స్టాక్‌ను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి మీకు హక్కును అందించే ఒక రకమైన హక్కు, కానీ అది బాధ్యత కాదు. భవిష్యత్తులో నిర్ణీత తేదీలో ముందుగా నిర్ణయించిన ధర వద్ద ఇది కొనుగోలు చేయబడుతుంది.

బుల్లిష్ స్టాటజీలు..
A.కాల్ ఆప్షన్ కొనుగోలు..
మీరు స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నట్లయితే.. కాల్ ఆప్షన్లలను కొనుగోలు చేస్తారు. మీరు కాల్‌ని కొనుగోలు చేసినప్పుడు భవిష్యత్తులో నిర్దిష్ట స్ట్రైక్ ధరకు స్టాక్‌ను కొనుగోలు చేసే హక్కు ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు ముగిసే సమయానికి మీరు అంగీకరించిన స్ట్రైక్ ధర కంటే రేటు పెరిగితే.. అది మీరు చెల్లించిన ప్రీమియంను కూడా కవర్ చేస్తే.. మీరు లాభం పొందుతారు.
B.పుట్ ఆప్షన్ అమ్మటం..
మీరు పుట్ ఆప్షన్‌ను స్టాక్ స్ట్రైక్ ధర కంటే తక్కువగా ఉండదని మీరు ఊహిస్తూ పని చేస్తారు. ఇది ప్రీమియానికి బదులుగా చేయబడుతుంది. స్టాక్ ధర స్ట్రైక్ కంటే ఎక్కువగా ఉంటే పుట్ వ్రాసే వ్యక్తి లాభం పొందుతాడు. వీరికి ప్రీమియం లభిస్తుంది.

బేరిష్ స్టాటజీలు..
A.పుట్ ఆప్షన్ కొనుగోలు చేయటం..
మీరు పుట్ ఆప్షన్లను కొనుగోలు చేసినప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో స్ట్రైక్ ధరకు షేర్లను విక్రయించే హక్కు మీకు ఉంటుంది. స్ట్రైక్ ధర కంటే ఆప్షన్ ధరలు తగ్గితే.. మీరు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇన్వెస్టర్ లాభం పొందుతారు.
B.కాల్ ఆప్షన్ అమ్మటం..
మీరు కాల్ కాంట్రాక్టును అమ్మినప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో స్ట్రైక్ ధరతో షేర్లను కొనుగోలు చేయడానికి మీరు అంగీకరిస్తారు. స్ట్రైక్ కింద ధర ఉన్నంత వరకు కాంట్రాక్ట్ విలువ లేకుండా ముగుస్తుంది. ఇక్కడ ఆప్షన్ అమ్మిన వారికి ప్రీమియం ఆదాయంగా లభిస్తుంది. ఒకవేళ ఆప్షన్ ప్రైస్ అమ్మిన కాల్ స్ట్రైక్ ధర కంటే ర్యాలీ చేస్తే కాల్ అమ్మిన వ్యక్తులకు బాధ్యత ఉంటుంది. కాబట్టి వారికి భారీగా నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది.
Note: స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ నష్టాలతో కూడుకున్నది. మార్కెట్ల పనితీరుపై సరైన అవగాహన లేకుండా స్టాక్స్ లేదా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయటం భారీ నష్టాలకు దారితీయవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు సరైన అవగాహనతో, ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్ సలహాలను తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications