Gold Rate: దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు వేరువేరుగా ఉంటాయి. ఇవి రోజువారీ మారుతుంటాయని మనందరికీ తెలిసిందే. అయితే బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం రానున్న కాలంలో దేశంలో ఏ మూలన బంగారాన్ని కొన్నా రేటు మాత్రం ఒక్కటే ఉండనుంది.

ఒకటే బంగారం ధర..
శుక్రవారం గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (IIBX)ని ప్రారంభించింది. వ్యాపారులు సరకు రవాణా ఛార్జీలపై పెద్ద మొత్తంలో ఆదా చేస్తూ అంతర్జాతీయ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నందున భారతీయ నగల విక్రయదారులు ఉత్సాహంగా ఉన్నారు. క్వాలిఫైడ్ జ్యువెలర్స్, బ్యాంకులు అంతర్జాతీయ ధర చెల్లించి బంగారాన్ని దిగుమతి చేసుకోగలవు కాబట్టి ఈ ఎక్స్ఛేంజ్ 'ఒక దేశం ఒకే బంగారం రేటు' దిశగా ఒక అడుగుగా నిలుస్తోంది. బంగారం ఎగుమతులు చేసే వ్యాపారులకు అంతర్దాతీయ మార్కెట్లో పోటీపడేందుకు ఇది మంచి వెసులుబాటు కల్పిస్తుందని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయ ధర పొందటంలో వీలు..
దీని ద్వారా బంగారం ధరలో వచ్చే మార్పును వినియోగదారులకు అందించేందుకు వీలు ఉంటుందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారి అన్నారు. ఈ విండో ద్వారా బంగారం, వెండి ఎగుమతి వ్యాపారులు సులువుగా అంతర్జాతీయ మార్కెట్లలో దూసుకెళ్లవచ్చని అన్నారు. ఇది విన్ విన్ పరిస్థితి పేర్కొన్నారు.

అంతర్జాతీయ రేట్లకే..
ఆభరణాల తయారీదారులు ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా అంతర్జాతీయ ధరలకే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు అనుమతించబడ్డారు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 'ఒక దేశం ఒకే బంగారం' అమలు వైపు పెద్ద అడుగుగా పృథ్వీరాజ్ కొఠారి పేర్కొన్నారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో బంగారు వ్యాపారులు ఇందుకోసం వేరువేరు ధరలను చెల్లించాల్సి వచ్చేది. గిఫ్ట్ సిటీ ఓడరేవులకు దగ్గరగా ఉన్నందునే సుమారు 80-100 మిలియన్ డాలర్ల రవాణా ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రస్తుతం బంగారం, వెండి కోసం ఎక్స్ఛేంజ్ అందుబాటులో ఉందని, భవిష్యత్తులో బేస్ మెటల్స్ కూడా ఎక్స్ఛేంజ్లో అందుబాటులోకి రావచ్చని కొఠారి చెప్పారు.

బంగారం నాణ్యత..
గిఫ్ట్ సిటి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ద్వారా బంగారం దిగుమతి చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఛైర్మన్ అహమ్మద్ అన్నారు. ఎక్స్ఛేంజ్ గోల్డ్ ధరలో పారదర్శకతను తెస్తుందని, దిగుమతి చేసుకున్న బులియన్ నాణ్యత కోసం ఎక్స్ఛేంజ్ ఒక స్టాండర్డ్-సెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవటం వల్ల పెద్ద ఆభరణ వ్యాపారులకు లాభదాయకమని తెలిపారు. ఎక్స్ఛేంజ్‌లో పాల్గొనడం ద్వారా మార్జిన్ చెల్లింపులపై మంచి డబ్బు ఆదా చేయవచ్చని వెల్లడించారు.

మలబార్ గోల్డ్ & డైమండ్స్..
అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంపై మాట్లాడుతూ, మలబార్ గోల్డ్ & డైమండ్స్ చైర్మన్ అహమ్మద్ MP మాట్లాడుతూ, "IIBX ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మొదటిది, బంగారం ధరలను నిర్ణయించే విధానంలో క్రమాన్ని మరియు పారదర్శకతను ఎక్స్ఛేంజ్ తీసుకువస్తుంది. రెండవది, ఇది దిగుమతి చేసుకున్న బులియన్ నాణ్యత కోసం ఎక్స్ఛేంజ్ ఒక స్టాండర్డ్-సెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పని చేస్తుంది కాబట్టి బంగారం స్వచ్ఛత యొక్క ప్రామాణీకరణ వైపు కదలికను బలపరుస్తుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications