Mutual Funds: ప్రస్తుత కాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లలో తమ డబ్బును ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నప్పటికీ భయంతో వెనకడుగువేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు.
చిన్న మదుపరులు సైతం సిప్ రూపంలో పొదుపుకు అలవాటు పడుతున్నారు. పిల్లల చదువులు, సొంతింటి కల, వివాహం లేదా ఇతర అవసరాలకు డబ్బును దాచుకుంటున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చుల కారణంగా పిల్లల భవిష్యత్తు కోసం చాలా మంది మంచి ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ మూడేళ్లలోనే 3 రెట్లు రాబడిని అందించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది పిల్లల కోసం రూపొందించబడిన ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇది లాక్ ఇన్ పిరియడ్ కలిగి ఉంటుంది. కనిష్ఠంగా 5 ఏళ్లు దీనికి లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించేందుకు ఫండ్ మెుత్తాన్ని ఈక్విటీ సంబంధింత సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతోంది. దీని ఎక్స్‌పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ కింద 0.94 శాతంగా ఉంది. ఏడాది లోపు ఫండ్ నుంచి నిష్క్రమిస్తే 3 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్టర్ దీనిలో అత్యల్పంగా రూ.500 నుంచి తన SIPని ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగస్టు 31, 2023 నాటికి ఫండ్ కింద ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూపంలో రూ.1,182.26 కోట్లను నిర్వహిస్తున్నారు. ఈ స్కీమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటి రంగాల్లోని 29 కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉంది. అలాగే 0.85 శాతం డెట్ కింద ఇన్వెస్ట్ చేసింది. 16.28 శాతం ఇతర అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టబడింది. ఫండ్ పనితీరును గమనిస్తే 29 సెప్టెంబర్ 2020న స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఇందులో ఎవరైనా ఇన్వెస్టర్ రూ.10 లక్షలు పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ.30.10 లక్షలుగా ఉంది. అలాగే సిప్ ద్వారా నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తి మెుత్తం రూ.3.60 లక్షల పెట్టుబడితో మూడేళ్లలో రూ.5.41 లక్షలు పొందేవారు.


Click it and Unblock the Notifications