IPO Stock: అద్భుతాలు సృష్టిస్తున్న ఐపీవో స్టాక్.. 4 నెలల్లో నాలుగింతల లాభం..
IPO Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఊహించని లాభాలను అందిస్తూ ఇన్వెస్టర్ల సంపదను వేగంగా వృద్ధి చెస్తున్నాయి.
ప్యాకేజింగ్ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్న SME కంపెనీ క్రిష్కా స్ట్రాపింగ్ సొల్యూషన్స్. ఇది ఈ ఏడాది మార్కెట్లోకి ఐపీవోగా అరంగేట్రం చేసింది. గత నాలుగు నెలల్లో బలమైన రాబడితో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. మల్టీబ్యాగర్ గా మారిన స్టాక్ ఐపీవోగా వచ్చినప్పుడు దాని ప్రైస్ బ్యాండ్ రూ.51-64గా ఉంది. మే 26న మార్కెట్లోకి 100 శాతం కంటే ఎక్కువ ప్రీమియం ధరకు NSEలో జాబితా చేయబడింది.

మార్కెట్లోకి అరంగేట్రం చేసిన సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.118.80 చొప్పున ఉన్నాయి. దీంతో ఐపీవోలో షేర్లను గెలుచుకున్న ఇన్వెస్టర్ల సంపద తొలిరోజే రెండింతలైంది. 120 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాక.. స్టాక్ కొత్త గరిష్ట స్థాయి రూ.299కి చేరుకుంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవటంతో ఆ తర్వాత కొంత ఒడిదొడుకులకు లోనైంది. అయితే మెుత్తానికి ఐపీదో దాని ఇన్వెస్టర్లకు దాదాపు 325 శాతం రాబడిని అందించింది.
కంపెనీ ఐపీవోలో ఒక లాట్‌కు 2,000 షేర్లను చొప్పున విక్రయించింది. అంటే ఇన్వస్టర్లు ప్రారంభంలో కనీసం రూ. లక్ష పెట్టుబడిగా పెట్టారు. అలా ఐపీవోలో లక్ష రూపాయలు ఇన్వెస్టర్ చేసిన పెట్టుబడిదారులకు ప్రస్తుతం స్టాక్ ధర రూ.228.90 రేటు చొప్పున రూ.4.57 లక్షల రాబడిని పొందారు. అంటే ఈ NSE SME స్టాక్ షేర్ లిస్టింగ్ అయిన 4 నెలల్లోనే కేటాయించిన రూ.1.08 లక్షలను రూ.4.57 లక్షలుగా మార్చింది.


Click it and Unblock the Notifications