Muhurat Trading 2023: ఆగయా ముహురత్ ట్రేడింగ్.. టైమింగ్స్, హిస్టరీ, ప్రాముఖ్యత ఇదే..
Muhurat Trading 2023: దేశంలోని అనేక మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. దీపావళికి ప్రత్యేకంగా నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ నవంబర్ 12, 2023న ఒక గంట పాటు నిర్వహించనున్నారు.
దేశీయంగా హిందువులు దీపావళి నుంచి కొత్త పనులు ప్రారంభించటానికి మంచి కాలంగా పరిగణిస్తుంటారు. అందుకే నవంబర్ 12న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేకంగా ఒక గంట పాటు నిర్వహించబడుతోంది. అలాగే నవంబర్ 14న మార్కెట్లు మూసివేసి ఉండనున్నాయి. ముహురత్ ప్రత్యేక ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ లలో వ్యాపారం జరుగుతుంది.

నవంబర్ 12 సాయంత్రం 5.45 గంటలకు బ్లాక్ డీల్ సెషన్ ప్రారంభమౌతుంది. అలాగే సాయంత్రం 6 నుంచి 6.08 వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ 8 నిమిషాల పాటు కొనసాగనుంది. మెుత్తంగా ప్రీమార్కెట్ సెషన్ 15 నిమిషాలు కూడా ఉంటుంది. ఈ క్రమంలో కమోడిటీస్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ 6.15 నుంచి 7.15 మధ్య కాలంలో సాయంత్రం నిర్వహించబడుతుంది. గడచిన 10 ముహురత్ ట్రేడింగ్ సెషన్లను గమనిస్తే ఏడింటిలో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.
అయితే సంవత్ 2080లో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయని అందరిలోనూ అనుమానాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, అధిక వడ్డీ రేట్లు, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు మాత్రం మెరుగైన పనితీరును కనబరిచాయి. బంగారం ధరలు సైతం ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టాయి. ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా కొనసాగుతాయనే అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇన్వెస్టర్ల చూపు ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లపై పడిందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ పెట్టుబడులు సైతం మంచి రాబడులను తెచ్చిపెడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications