Success Story: సక్సెస్ ఎవ్వరికీ రాత్రికి రాత్రే రాదు. కాలమే గమ్యాన్ని మారుస్తుందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. చేస్తున్న వ్యాపారం నష్టపోయినా కొత్త అవకాశంలో ధనవంతుడైన వ్యాపారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ బిల్డ్‌కాన్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలోని మూడు నెలల్లోనే కంపెనీ విక్రయాలు రూ.2,200 కోట్లుగా నమోదయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ లాభం రూ.12.31 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో ఎంపీ ప్రభుత్వం నుంచి రూ.700 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను సంస్థ దక్కించుకున్న తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.

ఈ కంపెనీని 1987లో దిలీప్ సూర్యవంశీ స్థాపించారు. ప్రస్తుతం ఆయన దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్‌లో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపారంలో దిలీప్ దాదాపు 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని కలిగి ఉన్నారు. జబల్పూర్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2006లో కంపెనీ స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో కంపెనీ అసలు పేరు దిలీప్ బుల్డర్స్ గా ఉండేది.
రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లను నిర్మించటంలో కంపెనీకి అనుభవం ఉంది. యువకుడిగా సూర్యవంశీ ఎప్పుడూ ఎవరి దగ్గరా పనిచేయాలని అనుకోలేదు. అతని తండ్రి పోలీసు దళంలో ఉండేవాడు. 1979లో చదువు తర్వాత భోపాల్‌లోని తన సోదరుడి సోయా బీన్ ఫ్యాక్టరీలో చేరారు. కరువు కారణంగా వ్యాపారం మూసేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం భాగస్వామిగా ఉన్న దేవేంద్ర జైన్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి.
వ్యాపారాన్ని ముసివేయటంతో ఆయన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పుడే 1995లో 21 ఏళ్ల ఇంజనీర్ దేవేంద్ర జైన్‌ను నియమించుకున్నారు. ఆ తర్వాత అతని ప్రాముఖ్యతను గ్రహించి తన వ్యాపారంలో 31 శాతం వాటాను ఇచ్చి భాగస్వామిగా చేర్చుకున్నారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ కోటీశ్వరులుగా మారిపోయారు. 2021 హురున్ జాబితా ప్రకారం జైన్ నికర విలువ రూ.2,300 కోట్లు, సూర్యవంశీ నికర విలువ రూ.4,100 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications