IPO News: ఐపీవోకి వస్తున్న 35 ఏళ్ల కంపెనీ.. 75 దేశాల్లో వ్యాపారం.. బెట్టింగ్ కోసం గెట్ రెడీ..

Mamata Machinery IPO: రేపటి నుంచి జూలై మాసం ప్రారంభం అవుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి సరికొత్తగా మరిన్ని ఐపీవోలు లిస్టింగ్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో వీటిపై బెట్టింగ్ వేయాలనుకునే ఇన్వెస్టర్లకు కొత్త కంపెనీల ఐపీవోలు సదవకాశాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మమతా మెషినరీ కంపెనీ ఐపీవో రాక గురించే. గుజరాత్‌కు చెందిన ప్యాకేజింగ్ పరికరాల తయారీదారు మమతా మెషినరీ లిమిటెడ్ ఇప్పటికే ఐపీవో లాంచ్ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద ప్రాథమిక పత్రాలను ఇప్పటికే సమర్పించిన సంగతి తెలిసిందే. కంపెనీ DRHP ప్రకారం ప్రమోటర్లు తమకు చెందిన 73.82 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని చూస్తున్నట్లు వెల్లడైంది. OFS కింద షేర్లను విక్రయిస్తున్న వారిలో మహేంద్ర పటేల్, నయన పటేల్, భగవతి పటేల్, మమతా గ్రూప్ కార్పొరేట్ సర్వీసెస్ LLP, మమతా మేనేజ్‌మెంట్ సర్వీసెస్ LLP ఉన్నారు. తాజా ఐపీవో నుంచి కంపెనీకి ఎలాంటి ఆదాయం వెళ్లదని తెలుస్తోంది.

Know about Mamata Machinery Limited company that coming for IPO papers with SEBI

మమత మెషినరీ ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ పర్సు మేకింగ్ మెషీన్లు, ప్యాకేజింగ్ మెషీన్లను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. ఇది ప్యాకేజింగ్ పరిశ్రమకు పూర్తి తయారీ పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీ తన యంత్రాలను 'వేగా', 'విన్' బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. మే 2024 నాటికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో దాదాపు 4500 కంటే ఎక్కువ యంత్రాలను ఇన్‌స్టాల్ చేసింది. కంపెనీ ఈ వ్యాపారంలో 1989 నుంచి ఉంది. అలాగే స్టెప్పర్ మోటార్, డ్రైవ్ అండ్ మైక్రోప్రాసెసర్ కంట్రోలర్, సాంప్రదాయ క్లచ్-బ్రేక్, ర్యాక్-పినియన్ అసెంబ్లీ లేకుండా ప్లాస్టిక్ బ్యాగ్ మేకింగ్ మెషీన్‌లను పరిచయం చేసిన మొదటి భారతీయ కంపెనీ కావటం గమనార్హం.

రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలను తీసుకొస్తున్న మూడు కంపెనీలు ఏకంగా మార్కెట్ల నుంచి రూ.2,700 కోట్లకు పైగా మూలధనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైర్ రాబోయే వారంలో మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ ఐపీవోలను కలిగి ఉండగా.. అంబే లేబొరేటరీస్ మాత్రం ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తోంది. అలాగే దాదాపు 11 ఐపీవోలు మార్కెట్లో లిస్టింగ్ కోసం రానున్న వారం మార్కెట్లలోకి క్యూ కట్టనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+