IPO News: కొత్త వారం సరికొత్త ఐపీవో తన ప్రయాణాన్ని మెుదలుపెడుతోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీ కిందకు వచ్చే కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం నేడు తెరుచుకోబోతోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మధుసూదన్ మసాలా కంపెనీ ఐపీవో గురించే. ఇది సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 21 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఐపీవో కోసం షేర్ ధర ప్రైస్ బ్యాండ్‌ను 66-70గా ప్రకటించింది. ఇదే క్రమంలో షేర్ల అలాట్మెంట్ సెప్టెంబర్ 26న నిర్ణయించబడనుంది. అక్టోబర్ 3న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీ కింద లిస్ట్ చేయబడతాయని తెలుస్తోంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.23.80 కోట్ల రూపాయలను మార్కెట్ల నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 10 రూపాయలు ముఖ విలువ కలిగిన 34 లక్షల ఫ్రెష్ షేర్లను జారీ చేస్తోంది. ఐపీవో కోసం లాట్ సైజును 2,000 షేర్లుగా నిర్ణయించారు. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పార్టిసిపేట్ చేయాలంటే కనీసం రూ.1.40 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ మెుత్తం షేర్లలో 50 శాతాన్ని QIBలకు, 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఈ డబ్బును వ్యాపార అవసరాలు, ఐపీవో ఖర్చుల కోసం కంపెనీ వినియోగించనుంది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే "డబుల్ హాథీ" "మహారాజా" బ్లాండ్ల కింద 32 రకాల సుగంధ ద్రవ్యాలను విక్రయిస్తోంది. మధుసూదన్ మసాలా తయారీ కేంద్రం గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియా హాపాలో ఉంది. అలాగే కంపెనీకి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో 2,100 హోల్ సేల్ వ్యాపారులు, 3,700 రిటైలర్ల నెట్‌వర్క్ ఉంది.


Click it and Unblock the Notifications