Mankind Pharma IPO: ప్రఖ్యాత దేశీయ ఫార్మా దిగ్గజం మ్యాన్‌కైండ్ తన తొలి పబ్లిక్ ఇష్యూని విజయవంతంగా ముగించింది. ఈ క్రమంలో ఐపీవోకి ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించటంతో 15 రెట్లు పైగా సబ్‌స్క్రయిబ్ కావటంతో బలమైన నోట్‌తో ముగించింది.
ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం మే 3న షేర్ అలాట్మెంట్ చేపట్టనుంది. ఇప్పుడు ఐపీవోలో షేర్ల కోసం అప్లై చేసిన అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ క్రమంలో ఐపీవో అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల నుండి బలమైన ప్రతిస్పందనను పొందింది. ఈ విభాగానికి కేటాయించినదాని కంటే 49.16 రెట్లు ఎక్కువ బిడ్స్ వచ్చాయి. అలాగే హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ విభాగానికి రిజర్వు చేసిన 3.8 రెట్లు షేర్లను కొనుగోలు చేశారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే వారికి కేటాయించిన మెుత్తంలో కేవలం 92 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ చేయబడింది.

ఏప్రిల్ 25 నుంచి 27 వరకు తెరచి ఉన్న ఆఫర్లో మెుత్తం 42.95 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్‌లు వచ్చాయి. CPPIB, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, గోల్డ్‌మన్ సాక్స్, ఫిడిలిటీ, బ్లాక్‌రాక్, GIS, నోమురా వంటి సంస్థలు యాంకర్ రౌండ్ లో మంచి ఆసక్తిని కనబరిచారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం ఇందులో పాల్గొన్నాయి. కంపెనీ ఐపీవో బ్యాండ్ ప్రైస్ ను ఒక్కో షేరుకు రూ.1,026-1,080గా నిర్ణయించింది.
ఐపీవోలో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రూ.4,326 కోట్ల పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల ఆఫర్ ఫర్ సేల్ వాటాలను విక్రయించటానికి ఏర్పాటు చేసింది. అంటే తాజా ఐపీవో నుంచి వచ్చే మెుత్తం డబ్బు సదరు వాటాదారులకు మాత్రమే వెళ్లనుంది. కంపెనీకి ఐపీవో ద్వారా ఎలాంటి నిధులు అందబోవు. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు కొంత విముకత చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఐపీవో ఎలాట్మెంట్ వివరాలను IPO రిజిస్ట్రార్ వెబ్‌సైట్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులు IPO "మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్"ని ఎంచుకుని.. డీమాట్ లేదా పాన్ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత Captcha" ఎంటర్ చేసి, "Submit" బటన్ పై క్లిక్ చేస్తే షేర్ల అలాట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications