చంద్రయాన్ వెనక ఉన్న 6 కంపెనీల గురించి తెలుసా..? ఈ షేర్లు మీ దగ్గర ఉన్నాయా..?
Chandrayaan 3: భారతదేశం గర్వించదగిన ప్రయోగం చంద్రయాన్. అంత్యంత తక్కువ ఖర్చులో చందమామ గుట్టు విప్పేందుకు ఇండియా చేస్తున్న ప్రయోగం. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇప్పుడు అందరి చూపు పరికరాలు సరఫరా చేసిన కంపెనీలపై పడింది.
భారతీయ అంతరీక్ష పరిశీధన సంస్థ ఇస్రో విజయం వెనుక కొన్ని కంపెనీల కృషి, నిబద్ధత కూడా ఉంది. చంద్రయాన్-2 సాఫ్ట్-ల్యాండింగ్‌లో విఫలమైన తర్వాత.. అత్యంత గౌరవనీయమైన అంతరిక్ష సంస్థ చంద్రయాన్-3ని సిద్ధం చేయడానికి దాదాపు నాలుగు ఏళ్లు శ్రమించింది. అనేక భారతీయ సంస్థలతో కలిసి అంతరిక్ష సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త అంతరిక్ష నౌకను రూపొందించింది. దీంతో ప్రపంచం చూపు ఇప్పుడు భారత్ వైపు ఉంది.

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడానికి సహకరించిన కంపెనీల జాబితాపై ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు ప్రఖ్యాత ప్రాజెక్టుకు సహకారం అందించిన కంపెనీల గురించి తెలుసుకోవాలని అంతర్జాలంలో సెర్చ్ చేస్తున్నారు. తాజా ప్రయోగాన్ని సఫలీకృతం చేయటం వెనుక.. లార్సెన్ అండ్ టూబ్రో (L&T), హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, MTAR టెక్నాలజీస్, లిండే ఇండియా కంపెనీల సహకారం ఉంది.
చంద్రయాన్ 3 మిషన్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అధిక లాభాలకు బదులుగా.. ఈ రంగంలోకి అనేక పెట్టుబడిని ఆకర్షిస్తుంది. భారత్ నుంచి వచ్చిన తాజా అంతరిక్ష యాత్ర.. అంతరిక్ష పరిశోధన, సాంకేతికతలో దేశ అసాధారణ విజయాలను ప్రదర్శిస్తుంది. ఈ ప్రయత్నం భారతీయ ప్రైవేట్ స్పేస్ ఎంటర్‌ప్రైజెస్ కోసం విస్తృత అవకాశాలను తెరవనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత్ సైతం అమెరికా వంటి అగ్రదేశాల సరసన చేరుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications