Bank Holidays July 2022: జూలై నెలలో బ్యాంక్ హాలిడేస్.. దాదాపు 17 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

Bank Holidays July 2022: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. జూలై 2022 నెలలో దేశంలోని వివిధ బ్యాంకులకు మొత్తం 17 రోజుల పాటు మూసివేయబడతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులు గెజిట్ సెలవులను పాటిస్తాయి. వీటికి అదనంగా బ్యాంకులు ఆదివారాలు, అన్ని చట్టబద్ధమైన సెలవుల్లో, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రజలు వీటిని కచ్చితంగా గమనించుకుని వారి పనులను ముందుగానే పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

జూలై నెలలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. ఈ కారణంగా.. స్థానిక క్యాలెండర్ ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులు ఆయా రోజుల్లో సెలవు కాబట్టి మూసివేసి ఉంటాయి. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే.. సెలవు రోజుల్లో కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి చెల్లింపులు లేదా ఇతర బ్యాంకింగ్ సేవలను ఈ సమయాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకునేందుకు వీలు ఉంటుంది.

in july banks going to be in closure for 17 days know full details

బ్యాంకుల సెలవుల గురించి ఒక్కసారి పరిశీలించినట్లయితే.. RBI బ్యాంకు సెలవులను మూడు కేటగిరీల కింద డివైడ్ చేస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్. అయితే జూలై 2022లో సెలవుల పూర్తి లిస్ట్ ఇప్పుడు తెలుసుకోండి.. ముందుగానే మీ బ్యాంకింగ్ పనులను పూర్తిచేసుకోండి.

Bank Holidays July 2022:

1. శుక్రవారం, జూలై 1- రథ యాత్ర (ఒడిశా)

2. మంగళవారం, జూలై 5- గురు హరగోవింద్ జీ పుట్టినరోజు (జమ్మూ & కాశ్మీర్)

3. బుధవారం, జూలై 6- MHIP డే (మిజోరం)

4. గురువారం, జూలై 7- ఖర్చి పూజ (త్రిపుర)

5. శనివారం, జూలై 9- ఈద్-ఉల్-అద్హా (బక్రీద్)/ రెండవ శనివారం

6. సోమవారం, జూలై 11- ఈద్-ఉల్-అజా

7. బుధవారం, జూలై 13- అమరవీరుల దినోత్సవం (జమ్మూ కాశ్మీర్)

8. బుధవారం, జూలై 13- భాను జయంతి (సిక్కిం)

9. గురువారం, జూలై 14- బెన్ డియెంక్లామ్ (మేఘాలయ)

10. శనివారం, జూలై 16- హరేలా (ఉత్తరాఖండ్)

11. శనివారం, జూలై 23- నాల్గవ శనివారం

12. మంగళవారం, జూలై 26- కేర్ పూజ (త్రిపుర)

వీటికి తోడు అనేక ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి. అవి వివిధ రాష్ట్రాల మధ్య మారుతుంటాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+