For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold: ఆదాయపు పన్ను భయం లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? పూర్తి వివరాలు..

|

Gold Limit: మెజారిటీ భారతీయులు ఎప్పుడూ ఇంట్లో బంగారాన్ని ఉంచుకుంటారు. బంగారం కొనుగోలును గర్వంగా భావించే చాలా మంది దేశంలో ఉన్నారు. అందుకే భారతదేశాన్ని ఒకప్పుడు 'బంగారు పక్షి' అని పిలిచేవారు. కానీ ప్రజలకు బంగారంపై ప్రేమ ఉన్నప్పటికీ, దానిని ఇంట్లో ఉంచడానికి కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఆ క్రైటీరియా ఏమిటో తెలిస్తే ఆదాయపు పన్ను శాఖ అధికారుల భయం లేకుండా బంగారాన్ని మనవద్ద ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియన్స్ అండ్ గోల్డ్..

ఇండియన్స్ అండ్ గోల్డ్..

ప్రపంచంలోని బంగారంలో ఎక్కువ భాగం భారతీయుల దగ్గరే ఉందని అనేక మంది నమ్ముతారు. కులమతాలతో సంబంధం లేకుండా.. ప్రతి భారతీయ కుటుంబానికీ బంగారం ఒక ముఖ్యమైన భాగం. చాలా బంగారం కలిగి ఉండటాన్నా ఇనేక మంది గర్వంగా భావిస్తుంటారు.

సాంస్కృతిలో భాగంగా..

సాంస్కృతిలో భాగంగా..

ఇతర దేశాల్లో బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా పరిగణించబడుతున్నప్పటికీ.. మన దేశంలో మాత్రం పసిడిని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, సాంస్కృతికంగా ముఖ్యమైన లోహంగా చూస్తారు.

గోల్డెన్ రూల్ పరిమితి..

గోల్డెన్ రూల్ పరిమితి..

మెజారిటీ భారతీయ కుటుంబాలు బంగారాన్ని కొనుగోలు చేసి, ఇప్పటికే కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చనే దానిపై చట్టపరమైన పరిమితుల గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో, 1968 నాటి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఏ పౌరుడూ అదనపు బంగారాన్ని కలిగి ఉండకుండా నిషేధించింది.

అధికారిక డాక్యుమెంట్స్..

అధికారిక డాక్యుమెంట్స్..

కానీ 1990లో చట్టం రద్దు చేయబడినప్పుడు బంగారం యాజమాన్యంపై ఉన్న సీలింగ్ కూడా తొలగించబడింది. దీంతో బంగారానికి సరైన డాక్యుమెంటేషన్ ఉంటే.. ప్రజలు ఎంత బంగారాన్నైనా కలిగి ఉండవచ్చు ఎలాంటి పరిమితి ఉండదనే విషయాన్ని గుర్తించాలి. వారసత్వానికి సంబంధించిన రుజువును చూపిస్తే ఎలాంటి సమస్య లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 2016లో జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది.

బంగారం జప్తు..

బంగారం జప్తు..

ఎంత బంగారాన్ని కలిగి ఉన్నా, బంగారం హోల్డర్ ఆదాయం, బంగారం మొత్తానికి అనుగుణంగా ఉందా? అనేది కూడా చాలా ముఖ్యం. సదరు వ్యక్తి కలిగి ఉన్న బంగారానికి అవసరమైన రుజువును అందించడం ద్వారా.. ఆదాయపు పన్ను శాఖ పరిశీలన నుంచి తప్పించుకోవచ్చు. అయితే అవసరమైన ఆధారాలు లేనిపక్షంలో వ్యక్తుల వద్ద ఉన్న బంగారాన్ని జప్తు చేసే అధికారం అసెస్సింగ్ అధికారికి ఉంటుంది.

బంగారంపై లిమిట్స్ ఇలా..

బంగారంపై లిమిట్స్ ఇలా..

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండటం చట్టబద్ధం. పెళ్లికాని మహిళలు కేవలం 250 గ్రాములు మాత్రమే బంగారాన్ని కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. అదే విధంగా.. వివాహితుడైనా, కాకపోయినా ప్రతి పురుషుడు 100 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ..

ఆదాయపు పన్ను శాఖ..

పైన పేర్కొన్న పరిమితుల్లో ఎవరైనా వ్యక్తి బంగారు ఆభరణాలు కలిగి ఉన్నట్లయితే.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాటిని జప్తు చేయరు. సరళంగా చెప్పాలంటే.. ఒక వ్యక్తి తన ఇంట్లో అనుమతించిన దానికంటే ఎక్కువ బంగారాన్ని ఉంచినట్లయితే, అదనపు బంగారానికి సంబంధించిన వివరాలు అధికారులకు అందించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆధారాలు చూపలేకపోయినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

English summary

Gold: ఆదాయపు పన్ను భయం లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? పూర్తి వివరాలు.. | know about limits on gold that one can hold according to cbdt rules with out any problems

know about limits on gold that one can hold according to cbdt rules with out any problems
Story first published: Monday, August 8, 2022, 11:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X