LIC News: మూడు రోజులే గడువు.. పెట్టుబడికి ఎల్ఐసీ మంచి ప్లాన్.. మిస్ కాకండి..
LIC Dhan Vriddhi: ప్రభుత్వ రంగం బీమా సంస్థ ఎల్ఐసీ దేశంలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినప్పటికీ ప్రజల మెుదటి ఎంపికగా ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని కేటగిరీల ప్రజలకు ఉత్పత్తులను అందిస్తూ దూసుకుపోతున్న నమ్మకమైన సంస్థగా ఎదిగింది.
ఈ క్రమంలో ధన వృద్ధి పేరుతో తీసుకొచ్చిన సింగిల్ ప్రీమియం ప్లాన్ ఈనెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది. దీనిని లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ రూపంలో బీమా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సేవింగ్స్‌తో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఏకకాలంలో పాలసీదారులకు అందించటమే ఈ ప్లాన్ ప్రత్యేకత. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటానికి మీ సమీప బ్రాంచ్ కార్యాలయాన్ని సంప్రదించొచ్చు. ఆన్‌లైన్ లో కూడా దీని వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్రత్యేక పాలసీ పూర్తి వివరాలను గమనిస్తే.. ఇదొక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్ బెనిఫిట్స్ అందించే లైఫ్ ఇన్సూరెస్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తాన్ని అందిస్తుంది. మెుదటి ఎంపిక ప్రకారం పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు, రెండో ఆప్షన్ ప్రకారం మొత్తం 10 రెట్లు రిటర్న్ అందించబడుతుంది.
పాలసీని 10, 15, 18 ఏళ్ల కాలానికి తీసుకునే వెసులుబాటు ఉంది. కనీసం మూడు నెలల వయస్సు నుంచి గరిష్ఠంగా 60 ఏళ్ల వయస్సు వ్యక్తులకు ఈ పాలసీ రెండు ఆప్షన్ల కింద పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తుంది. మెుదటి ఆప్షన్‌లో ప్రతి రూ.1,000పై ఎంచుకున్న టర్మ్ ఆధారంగా ఏడాదికి రూ.60-75 వరకు గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. అలాగే ఆప్షన్-2 కింద మొత్తం టర్మ్ బట్టి రూ.25-40 మధ్య ఉంటుంది. దీనిపై రుణాన్ని పొందే వెసులుబాటును ఎల్ఐసీ పాలసీదారులకు అందిస్తోంది. అలాగే ఆదాయపు పన్నులోని సెక్షన్-80సి కింద పన్ను మినహాయింపులను సైతం పెట్టుబడిదారులు పొందవచ్చు.


Click it and Unblock the Notifications