Adani News: ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలోనూ వెనుక కనిపించకుండా ఒక స్త్రీ ఉంటుంది. అదే విషయంలో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ జీవితంలోనూ ఉంది. అయితే ఈ కోణం గురించి మనలో చాలా మందికి తెలియదు.
వివరాల్లోకి వెళితే.. అంబానీ తర్వాత దేశంలో అత్యంత ధనిక వ్యాపారవేత్త అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు గౌతమ్ అదానీ. అనేక లిస్టెడ్ కంపెనీలు కలిగిన అదానీ పేరు నిత్యం వార్తల్లో వస్తూనే ఉంటుంది. దీనికి కారణం వేగంగా పెరుగుతున్న ఆయన వ్యాపారాలు, సంపద. వీటన్నింటి వెనుక భార్య ప్రీతి అదానీ ఉన్నారనే విషయం మనం తెలుసుకోవాలి. వాస్తవానికి ప్రీతి గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక డెంటిస్ట్ అని మనలో చాలా మందికి తెలియదు. ఆమె డాక్టర్ స్థాయి నుంచి భర్త వ్యాపార ఎదుగుదలలో భాగస్వామై అదానీ గ్రూప్ భారీ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు.

ప్రీతి అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ కోసం బీడీఎస్ కోర్సు పూర్తి చేసి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1986లో గౌతమ్ అదానీ-ప్రీతిల వివాహం జరిగింది. అప్పుడు ప్రీతి మంచి చదువు పూర్తి చేశారు. దీనిపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గౌతమ్ అదానీ.. కనీసం కాలేజీకి కూడా వెళ్లని తనను ప్రీతి అంగీకరిస్తుందని, తనను పెళ్లి చేసుకుంటుందని తాను అస్సలు ఊహించలేదని వెల్లడించారు. అది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ప్రీతి రాకతో వ్యాపారాన్ని మించి తనకు తోచినంతలో సేవ చేయాలనే ఆలోచన అదానికి కలిగింది. అలా ఆమె ప్రేరణతోనే అదానీ ఫౌండేషన్ సృష్టించబడింది. ప్రస్తుతం ప్రీతి అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
అదానీ ఫౌండేషన్ 1996లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫౌండేషన్ భారతదేశంలోని 19 రాష్ట్రాల్లోని 5,853 గ్రామాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తోంది. అదానీ ఫౌండేషన్ ద్వారా దాదాపు 70 లక్షల మంది జీవితాలు మారాయి. అదానీ ఫౌండేషన్ విద్య, ప్రజారోగ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. అదానీ గ్రూప్ ఆర్జించే లాభాల్లో 3% అదానీ ట్రస్ట్‌కు కేటాయించబడుతుంది.
ప్రజల అక్షరాస్యత రేటును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రీతి ట్రస్ట్ పనిచేస్తున్నారు. ప్రీతి అదానీ నాయకత్వంలో అదానీ గ్రూప్ సామాజిక సహకారం కేటాయింపు రూ.98 కోట్ల నుంచి రూ.128 కోట్లకు పెరిగింది. తన కెరీర్, డెవలప్‌మెంట్‌లో తన భార్య ప్రీతి పాత్ర చాలా ముఖ్యమైనదని గౌతమ్ అదానీ వివిధ ఇంటర్వ్యూలలో గర్వంగా చెప్పారు. ప్రస్తుతం ప్రీతి అదానీ నికర విలువ దాదాపు 8,000 కోట్లుగా ఉంది. ఈ దంపతులకు కరణ్, జీత్ అదానీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు ప్రస్తుతం అదానీ గ్రూప కంపెనీల్లో వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తూ తండ్రితో పాటు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications