Stock Market: ఈ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే.. జాగ్రత్త ఇన్వెస్టర్స్.. తెలుసుకోండి
Market Next Week: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే చివరి రెండు రోజులు కొంత మేర కోలుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ టెన్షన్ తో పాటు వచ్చేవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రానున్న వారంలో దేశంలోని ప్రధాన కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. దీంతో మార్కెట్లో అందరి చూపు టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మెటాల్సిక్స్ వంటి కంపెనీలపై ఉంది. దీనికి తోడు ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఎకనమిక్ డేటాపై ప్రధానంగా అందరి చూపు ఉంది. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఫారెక్స్ నిల్వలు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, క్రూడ్ ధరలు, రూపాయి మారకపు విలువ వంటి అంశాలపై ఫోకస్ పెరుగుతోంది.

వచ్చేవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ FOMC మినిట్స్ వివరాలు బయటకు రానున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు, దిగుమతులు ఎగుమతులకు సంబంధించిన డేటా విడుదల కానుంది. ఈ క్రమంలో విదేశీ సంస్థాగత మదుపరులు తమ వాటాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో నాలుగోసారి కూడా ఎలాంటి మార్పులను ప్రకటించకుండా స్థిరంగా కొనసాగించటం మార్కెట్లలో కొంత జోష్ నింపింది. రానున్న వారంలో ప్రధానంగా ఫోకస్ ఐటీ రంగం షేర్లపై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే.. నిఫ్టీకి 19500 కీలక సపోర్ట్ జోన్ కానుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 19750-19800 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ మార్కెట్లు చూడొచ్చని అంచనా వేశారు. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ సైతం కీలకంగా వ్యవహరించనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications