అమరావతి: జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగులకు అందిస్తున్న పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఆపైస్థాయి ఉన్నత విద్యకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఫీజు రీయింబర్సుమెంట్ కార్డులు
విద్యార్థులకు వైయస్సార్ నవశకం పేరుతో ఫీజు రీయింబర్సుమెంట్ కార్డులు జారీ చేయనున్నారు. రీయింబర్సుమెంట్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పథకం అమలుకు కలెక్టర్లు బాధ్యత వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20వేలు ఇస్తారు.

ఎవరికి వర్తిస్తాయి... ఎవరికి వర్తించవు
- ఈ రెండు పథకాలు వర్తించాలంటే కనీసం 75 శాతం మేర హాజరు తప్పనిసరి. 75 హాజరు శాతం తక్కువ ఉంటే ఇది వర్తించదు.
- ప్రయివేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి, కరస్పాండెంట్, దూరవిద్య, మేనేజ్‌మెంట్ కోటాలో, స్పాట్ విభాగంలో సీట్లు పొందిన వారికి కూడా వర్తించవు.
- ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ఇది వర్తిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే పథకాలు
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించిన అమౌంట్ మొత్తం విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ఆఱ్థిక సంవత్సరం నుంచే ఈ రెండు పథకాలు అమలు అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన డేస్కాలర్లు, కళాశాలల అనుబంధ వసతి గృహాల విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

జగనన్న విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు పూర్తి బోధనా రుసుములు చెల్లిస్తారు. బోధనా రుసుములను విద్యార్థులు చదివే కళాశాళల ఖాతాల్లో జమ చేస్తారు.

జగనన్న వసతి దీవెన
జగనన్న వసతి దీవెన కింద ఇచ్చే మొత్తాన్ని విద్యార్థి తల్లి ఖాతాలో (తల్లి లేకుంటే సంరక్షకుని ఖాతాలో) జూలై, డిసెంబర్ నెలల్లో రెండు విడతలుగా జమ చేస్తారు. సంక్షేమ, విద్యా సహాయాధికారులు విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలను సేకరించాలి.

సామాజిక తనిఖీ ద్వారా గుర్తించాక
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద అర్హులైన లబ్ధిదారులను సామాజిక తనిఖీ ద్వారా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు.

వారికి అన్నీ ఇస్తున్నందున.. వర్తించదు
సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ, ఆపై కోర్సులు చదివే వారికి జగనన్న వసతి దీవెన పథకం వర్తించదని సాంఘిక సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందున వీరికి పథకం వర్తించదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డేస్కాలర్లయిన ఐటీఐ విద్యార్థులకు రూ.5వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7500, డిగ్రీ, ఆపై కోర్సుల వారికి రూ.10వేలు మాత్రమే చెల్లిస్తామని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి వారికి పూర్తి మొత్తం చెల్లిస్తారు. శనివారం మధ్యాహ్నం ఒక జీవో, ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఉత్తర్వు రద్దు చేసి మరో జీవో ఇచ్చారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌పై క్లారిటీ రావాలి. డే స్కాలర్లకు పూర్తిగా చెల్లిస్తారు.

ఆదాయ పరిమితి
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి.
- ఆయా కుటుంబాలకు 10 ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట లేదా మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి.
- కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఉద్యోగ విరమణ పొంది పింఛన్ అందుకున్నా వర్తించదు.
- కుటుంబంలో ఎవరికీ నాలుగు చక్రాల వాహనం ఉండవద్దు. అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్న వారికి మినహాయింపు)
- పట్టణ ప్రాంతంలో 1500 చ.అ.కు మించి స్థిరాస్థి ఉండరాదు
- కుటుంబ సభ్యుల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉంటే వర్తించదు.
- పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు వర్తిస్తుంది.

ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు..
ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్ సైట్‌లో ఆయా విభాగాలకు అప్ లోడ్ చేస్తాయి. తహసీల్దారు ఇచ్చే ఆదాయ పరిమితి ధ్రవీకరణ పత్రాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు అర్హత కల్పిస్తారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications