IRCTC News: చౌకగా దేవాలయాల సందర్శన.. ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్..

IRCTC News: నవరాత్రుల తర్వాత కుటుంబంతో కలిసి లేదా ఒంటరిగా ఆలయాల సందర్శన చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. వీరికోసం ఐఆర్సీటీసీ అత్యంత తక్కువ ఖర్చుతో వివిధ ప్రఖ్యాత ఆలయనాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని IRCTC కోణార్క్, చిల్కా, పూరీలను తక్కువ ధరలో సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన విమాన యాత్రగా ఉంటుంది. గమ్య స్థానానికి చేరిన తర్వాత ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ టూర్‌లో భోజన సదుపాయం, వసతికి కూడా పూర్తిగా ప్యాకేజీలో భాగంగా వారే ఏర్పాట్లు చేశారు. అలాగే త్రీ స్టార్ హోటళ్లలో స్టే, గైడ్, భద్రత బాధ్యతను ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది.

Know about IRCTC devine puri tour package offered at lowest cost in detail

ఈ ప్యాకేజీకి డివైన్ పూరి టూర్ అని పేరు పెట్టింది. నవంబర్ 2, డిసెంబర్ 14, జనవరి 25, 2024, ఫిబ్రవరి 17, 2024, మార్చి 15, 2024 తేదీల్లో టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ కింద మూడు రాత్రులు, నాలుగు రోజుల పర్యటన ఉంటుంది. ఈ క్రమంలో చిల్కా, జగన్నాథ దేవాలయం, భువనేశ్వర్, కోణార్క్ ఆలయాలను సందర్శిస్తారు. అలాగే సమీపంలోని అన్ని అందమైన ప్రదేశాలను చూడొచ్చు. దిల్లీ నుంచి భువనేశ్వర్ వరకు విమాన ప్రయాణం ఉంటుంది.

టూర్ ప్యాకేజీ ధరను గమనిస్తే.. ఒక్కొక్కరికి రూ.40,900గా నిర్ణయించబడింది. అలాగే ఎవరైనా ఇద్దరు కలిసి ప్రయాణాన్ని చేస్తున్నట్లయితే వారికి ఒక్కొక్కరికి రూ.32,500 ఛార్జ్ చేయబడుతుంది. అలాగే ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నట్లయితే ఒక్కొక్కరికి రూ.31 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని, బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+