PM Jandhan: జన్ ధన్ ఖాతాతో రూ.1.30 లక్షలు ప్రయోజనం.. ఓడీ సౌకర్యం కూడా.. పూర్తి వివరాలు

PM Jandhan Account: దేశంలో చాలా మంది పేదలకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు మోడీ ప్రభుత్వ జన్ ధన్ యోజనను 2014లో తీసుకొచ్చారు. అనేక మంది గ్రామీణులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద సుమారు 47 కోట్ల మంది ఖాతాలను తెరిచారు. అలా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూ.1.30 లక్షలు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఖాతాదారులకు ప్రయోజనాలు..

ఖాతాదారులకు ప్రయోజనాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ కింద అకౌంట్ హోల్డర్లకు రెండు రకాల ఇన్సూరెన్స్ సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కాగా మరొకటి సాధారణ బీమా. యాక్సిడెంటల్ కవర్ కింద రూ. లక్ష ప్రయోజనం ఇస్తుండగా.. సాధారణ కవర్ కింద రూ.30 వేలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో ఖాతాదారుడికి ప్రమాదం జరిగితే 30,000 రూపాయలు ఇస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు అందజేస్తారు.

 జన్ ధన్ ఖాతా ఇతర ప్రయోజనాలు..

జన్ ధన్ ఖాతా ఇతర ప్రయోజనాలు..

జన్ ధన్ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు వడ్డీ లభిస్తుంది. పైగా ఈ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం చాలా మంది మెచ్చిన అంశం. అలాగే ఖాతాదారులకు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పైగా ఈ ఖాతాతో పాటు ఇచ్చే రూపే డెబిట్ కార్డులకు చాలా షాపింగ్ సైట్లలో మంచి డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జీరో బ్యాలెన్స్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు.

 ఖాతాను ఎవరు తెరవగలరు..

ఖాతాను ఎవరు తెరవగలరు..

భారత పౌరులు ఎవరైనా ఈ అకౌంట్ ను తెరవవచ్చు. ఖాతా తెరవడానికి కనీసం 10 ఏళ్ల వయస్సు ఉండాలి. బ్యాంక్ మిత్ర ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. 18-65 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రూపే కార్డు హోల్డర్లకు అదనంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా అందుబాటులో ఉంది. దీనిని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. బ్యాంకుల్లో మీకు ఏదైనా ఇతర పొదుపు ఖాతా ఉంటే.. దానిని జన్ ధన్ ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. దీని కోసం చిన్న దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

ఏఏ పత్రాలు అవసరం..

ఏఏ పత్రాలు అవసరం..

జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయటానికి KYCకి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, NREGA జాబ్ కార్డ్ లాంటి పత్రాలు అవసరం. ఈ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఖాతా ఓపెన్ చేసి 6 నెలలు పూర్తైనప్పుడు మాత్రమే ఓడీ సౌకర్యం అందించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+