FTX Crash: ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన FTX పతనం ఇన్వెస్టర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ వ్యవహారంలో కంపెనీ ఆర్థిక విధానాలకు భారతీయ సంతతికి చెందిన నిషాద్ సింగ్ పరిశీలనలో ఉన్నారు. ప్రస్తుతం క్రిప్టో ఎక్స్ఛేంజ్ క్లాష్ కావటంతో దివాళా తీసింది. ఇతడు FTX వ్యవస్థాపకుడితో కలిసి గతంలో జీవించాడు.

Facebookలో ఉద్యోగి..
నిషాద్ సింగ్ డిసెంబర్ 2017లో వివాదానికి కేంద్రంగా ఉన్న FTX సిస్టర్ కంపెనీ అయిన అలమేడ రీసెర్చ్‌లో చేరారు. దీనికి ముందు అతను దాదాపు ఐదు నెలల పాటు Facebookలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అతను సోషల్ మీడియా దిగ్గజంలో మెషిన్ లెర్నింగ్‌పై పనిచేసినట్లు తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ పొందుపరిచాడు.

అలమెడ రీసెర్చ్‌లో..
అలమెడ రీసెర్చ్‌లో 17 నెలల పాటు ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా నిషాద్ సింగ్ విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 2019లో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ FTXకి మారాడు. అప్పటి నుంచి అదే టాప్ ఇంజనీరింగ్ పోస్ట్‌లో కొనసాగుతూ వచ్చాడు.

క్లోజ్ సర్కిల్..
నిషాద్ సింగ్ 30 ఏళ్ల FTX వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ క్లోజ్ సర్కిల్ లోని వ్యక్తి. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్యారీ వాంగ్, నిషాద్, సామ్ కోడ్ ఎక్స్ఛేంజ్ మ్యాచింగ్ ఇంజిన్, ఫండ్‌లను నియంత్రిస్తారని కాయిన్‌డెస్క్ ప్రచురించింది. వీరు సొమ్మును తరలించినా లేదా వారి స్వంత ఖాతాలకు ఇన్‌పుట్ చేసినా ఎవరు గమనిస్తారో తనకు తెలియదని ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు సమాచారం.

రహస్య బదిలీ..
మాజీ FTX CEO సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ FTX నుంచి అల్మెడకు 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేసినట్లు రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. అల్మెడ రీసెర్చ్ CEO అయిన కరోలిన్ ఎల్లిసన్ బుధవారం జరిగిన వీడియో సమావేశంలో ఉద్యోగులతో మాట్లాడుతూ.. తనతో పాటు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు, నిషాద్ సింగ్, గ్యారీ వాంగ్ కస్టమర్ ఫండ్‌లను అల్మెడ, వాల్ స్ట్రీట్‌కు తరలించే నిర్ణయం గురించి తెలుసుని వెల్లడించారు.

విద్య..
నిషాద్ సింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. అతను కాలిఫోర్నియాలోని క్రిస్టల్ స్ప్రింగ్స్ అప్‌ల్యాండ్స్ స్కూల్‌లో చదువుకున్నాడు. 2017లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి సుమ్మ కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు.


Click it and Unblock the Notifications