Credit Suisse crisis: యూరప్ లోని స్విస్ బ్యాంక్ కుప్పకూలటంతో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రెడిట్ సూయిస్. మార్కెట్లలో భయాన్ని తగ్గించే ప్రయత్నంలో UBS బ్యాంక్ 3.2 బిలియన్ డాలర్లు వెచ్చించి స్వాధీనం చేసుకుంటోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం క్రెడిట్ సూయిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీక్షిత్ జోషి ఉన్నారు. ఆయన నేతృత్వంలోని బృందాలతో జరిగిన చర్చల త్వారత యూబీఎస్ డీల్ జరిగింది. బ్యాంక్ ను కాపాడే పనిలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. 2022 అక్టోబరులో జోషి సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టారు. జోషికి ముందు ఈ స్థానంలో విడ్ మాథర్స్ ఈ బాధ్యతలు నిర్వర్తించారు.

క్రెడిట్ సూయిస్ లో సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టడానికి ముందు జోషి ఐదేళ్లపాటు డ్యుయిష్ బ్యాంక్ గ్రూప్ ట్రెజరర్‌గా పనిచేశారు. బ్యాంక్ పునర్వ్యవస్థీకరణలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపటం, క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్‌ల మధ్య దానిని స్థిరీకరించడంలో సహాయం చేశారు. మూడు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఆయన అనేక సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ స్థానాల్లో కీలక పాత్రల్లో పనిచేశారు. అనేక సవాళ్లను విజయవంతంగా పరిష్కరించటంలో సహకరించారు.
జోషి దక్షిణాఫ్రికాలోని విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆతర్వాత యాక్చురియల్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. స్టాండర్డ్ బ్యాంక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఆయన తన మెుదటి ఉద్యోగాన్ని 1992లో ప్రారంభించారు. ఆ తర్వాత 1995-2003 మధ్య కాలంలో న్యూయార్క్, లండన్‌లోని క్రెడిట్ సూయిస్‌లో పనిచేశారు. తర్వాత బార్క్లేస్ క్యాపిటల్, డ్యుయిష్ బ్యాంక్ లలోనూ పనిచేశారు. ఈ క్రమంలో భారతదేశంలో విద్య కోసం పనిచేసే ప్రథమ్ అనే UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తారు.


Click it and Unblock the Notifications