Isha Ambani: దేశంలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ పగ్గాలు ఆమె చేతిలో పడినప్పటి నుంచి కంపెనీ వేగంగా విస్తరణ కొనసాగిస్తోంది. అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశంలోని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటికే అమిరి, అర్మానీ, వెర్సేస్, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడం వెనుక ఇషా కృషి అధికం. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీని డీల్ చేయడం చాలా కష్టమైన పని. అయితే ఈ విషయంలో ఇషా అంబానీకి అదృష్టం కలిసొచ్చిందని చెప్పుకోవాలి. రిలయన్స్ రిటైల్ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులు ఆమె వద్ద ఉన్నారు. ఈ క్రమంలో ఇషా రైట్ హ్యాండ్ దర్శన్ మెహతా చాలా కీలకమైన వ్యక్తిగా నిలిచారు.

దర్శన్ మెహతా రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్రాండ్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. 2007లో ముకేష్ అంబానీ స్థాపించిన ఈ కంపెనీలో మెుదటి ఉద్యోగి. ఈయన ఒక ఛార్టెడ్ అకౌంటెంట్, రన్నర్, హైకర్ పైగా పర్వతారోహకుడు కూడా. మెహతా మొదట్లో అడ్వర్టైజింగ్ పరిశ్రమలోకి పనిచేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా రిటైల్ రంగం వైపు అడుగుపెట్టాడు. టామీ హిల్‌ఫిగర్, కాంట్ అండ్ నౌటికా వంటి బ్రాండ్‌లను దేశంలోకి తీసుకురావడంలో మెహతా కీలక పాత్ర పోషించారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మెహతా రూ.4.89 కోట్లను వేతనంగా అందుకున్నారు. అలాగే రిలయన్స్ రిటైల్‌లో ఇషా అంబానీ విజయం వెనుక ఆయన కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఈ దూకుడు కారణంగా రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం 3,300 స్టోర్లను ప్రారంభించింది. ఈ స్టోర్లను 78 కోట్ల మంది కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలను చేస్తున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.
రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో మెుత్తం రిటైల్ స్టోర్ల కౌంట్ 18,040కి చేరుకుంది. కంపెనీలో 2.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఇషా వెల్లడించారు. కంపెనీ పగ్గాలు ఇషా చేతికి వచ్చిన తర్వాత జరిగిన వేగవంతమైన వ్యాపార విస్తరణ కారణంగా రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ భారీగా పెరిగి రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications