Google Flights: విమాన ప్రయాణం చాలా ఖరీదైనదని మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఖర్చును వీలైనంత తగ్గించుకోవాలని మనలో చాలా మంది చూస్తుంటారు. అలాంటి వారికోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
చౌకగా విమాన ప్రయాణానికి టిక్కెట్లను కొనటంలో గూగుల్ తీసుకొచ్చిన ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. దీనికోసం ఇన్‌సైట్స్ అనే కొత్త ఫీచర్ ఈవారం అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్ నిర్దిష్ట గమ్యస్థానానికి ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది.

విమానాల టేకాఫ్ సమయానికి దగ్గరగా ఫ్లైట్ టిక్కెట్‌ల ధర తగ్గుతుందా లేదా అని కూడా ఇది సూచిస్తుంది. ప్రయాణికులు బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారం పొందేందుకు తోడ్పడుతుంది. గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్‌ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. ఒక వేళధర తగ్గితే.. Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది.
గతంలోని డేటాను పరిశీలిస్తే.. క్రిస్మస్ కోసం కోసం విమానాలను బుక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం అక్టోబర్ ప్రారంభంలో ఉంటుంది. సగటున ధరలు విమానం బయలుదేరటానికి 71 రోజుల ముందు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమానాల కోసం విమాన ఛార్జీలు సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. Google Flights తెస్తున్న ఈ ఫీచర్ ప్రయాణికులకు విమాన టిక్కెట్‌ను ఎప్పుడు బుక్ చేసుకోవడం ఉత్తమమో కూడా తెలియజేస్తుంది.
అలాగే మీరు Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసినట్లయితే.. ఫ్లైట్ టికెట్ రేటు తగ్గిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Google Flightsతో ప్రయాణికులు కావాలనుకుంటున్న రోజు లేదా తేదీ కోసం ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేయవచ్చు. కాబట్టి మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి ముందుగా గూగుల్ కి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications