Flipkart: దేశంలో పుట్టిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. దీనిని స్థాపించిన వ్యక్తులు ప్రస్తుతం భారత స్టార్టప్ ప్రపంచంలో అనేక విజయవంతమైన కంపెనీలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు.
వినటానికి కొంత అతిశయోక్తిగా కనిపిస్తున్నప్పటికీ ఇది వాస్తవం. కంపెనీ వ్యవస్థాపకులు, ప్రారంభ ఉద్యోగులు Flipkartను వీడి ప్రస్తుత దేశంలోని స్టార్టప్ పరిశ్రమలో సూపర్‌స్టార్లుగా ఉన్నారు. అలా ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టి కంపెనీని ప్రారంభించిన గ్రూప్ టెక్నాలజిస్టులను "ఫ్లిప్‌కార్ట్ మాఫియా" అంటారు. ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ మాఫియా మాదిరిగా అమెరికాలో పేపాల్ మాఫియా ఉంది.

యూఎస్‌లో ఎలాన్ మస్క్, పీటర్ థీల్, 15 మందికి పైగా వ్యవస్థాపకులు పేపాల్ నుంచి వచ్చారు. వీరు ప్రారంభించిన కంపెనీలను పరిశీలిస్తే.. Tesla, LinkedIn, Palantir Technologies, SpaceX, Affirm, Slide, Kiva, YouTube, Yelp, Yammer కొన్నని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇండియా విషయానికి వస్తే.. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సల్, సందీప్ సోనీ, ముఖేష్ బన్సాల్, అంకిత్ నగోరి, కరణ్ భాటియా, నితిన్ గుప్తా, అంకిత్ నగోరిలు.. ఫ్లిప్‌కార్ట్ మాఫియా గ్రూప్ కిందకు వస్తారు. వీరిలో ఎక్కువ మంది ఐఐటీలకు చెందిన వారే. పైగా ఎక్కువ మంది ఐఐటీ దిల్లీ కాలేజీ విద్యార్థులే. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రారంభం 2007లో జరిగింది.
ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించడానికి ముందు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సల్ అమెజాన్‌లో పనిచేశారు. వారు అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి ఈ-కామర్స్ వ్యాపారంపై పూర్తి అవగాహనతో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. 2005-07లో దేశంలో ఆన్‌లైన్ వాణిజ్యం కొత్తది మాత్రమే కాదు, చాలా చిన్నది. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో వారు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపు, సరఫరా గొలుసు సమస్యలు, కస్టమర్ ట్రస్ట్ ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. మెుదట్లో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో పుస్తకాలు మాత్రమే విక్రయించబడ్డాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా అవతరించింది. ఫ్లిప్‌కార్ట్ విజయం వెనుక ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఉన్నారు. కంపెనీలోని 70 మంది ఉద్యోగులు దాదాపు 50 విజయవంతమైన స్టార్టప్‌లను దేశంలో నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని Udaan, Navi Technologies, PhonePe, Groww, Vogo, Cure.fit, Suki, Exotel, Arzooo, Hansel, Parrhai, Homefuly, xto10x Technologies అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications