Warren Buffet: అమెరికన్ ప్రముఖ పెట్టుబడిదారుడు, వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌ను ఫాదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని ముద్దుగా పిలుస్తారు. నిన్న ఆయన 92వ పుట్టినరోజును జరుపుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి, వారెన్ బఫెట్ ఇప్పటికీ ప్రధాన రోల్ మోడల్. ఆయన ప్రస్తుతంత బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, CEOగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఈ వారెన్ బఫెట్ ఎవరు?
వారెన్ బఫెట్ పూర్తి పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. ఆయన ఆగస్టు 30, 1930న నెబ్రాస్కాలోని ఒమాహాలో జన్మించాడు. అతని తండ్రి హోవార్డ్ బఫెట్. అతను ఒక స్టాక్ బ్రోకర్. వారెన్ బఫెట్ చిన్నతనంలో, యునైటెడ్ స్టేట్స్‌లో వచ్చిన ఆర్థిక సంక్షోభం తండ్రి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఫలితంగా.. చిన్నతనంలోనే కుటుంబం పేదరికంలోకి జారుకోవటం వల్ల వారెన్ బఫెట్ బాల్యం పేదరికంలో గడిచింది.

నిరుపేద కుటుంబం నుంచి..
ఫోర్బ్స్ డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న వారెన్ చిన్న వయస్సులోనే పేద కుటుంబంలో జన్మించాడు. 1944లో అతను కుటుంబం, జీవనోపాధి కోసం వాషింగ్టన్ పోస్ట్‌లో పేపర్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. పుస్తకాలు కూడా అమ్మేవాడు. కానీ ప్రస్తుతం అతని నికర ఆస్తుల విలువ దాదాపు 100.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

11 ఏళ్ల వయస్సు నుంచి..
బఫెట్ తన 11వ ఏట నుంచి సంపాదించడం ప్రారంభించాడు. చిన్న వయస్సు నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అతను తొలిసారిగా తన 13 ఏళ్ల వయస్సులో ఆదాయపు పన్ను దాఖలు చేశాడు. 1958లో కేవలం 31,500 డాలర్లు వెచ్చించి కొన్న ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

92 ఏళ్ల యువకుడు..
చిన్నతనం నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన ఈ 92 ఏళ్ల యువకుడు నేటికీ పెట్టుబడులు పెడుతున్నారు. విజయాన్ని అందుకుంటున్నారు. స్టాక్ మార్కెట్‌పై ఆయన రాసిన పుస్తకాలు కొన్ని నేటికీ పెట్టుబడిదారులకు మార్గనిర్ధేశకాలుగా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తిరస్కరించబడిన వారెన్.. ప్రస్తుతం అనేక మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు.

వారెన్ బఫ్ఫెట్ ప్రఖ్యాత కోట్స్..
* ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడకండి. అలాగే రెండవ ఆదాయాన్ని సిద్ధంగా ఉంచుకోండి.
* మనం ఇతరులకన్నా తెలివిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకన్నా ఎక్కువ క్రమశిక్షణతో ఉండాలి.
* మీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి.
* రూల్ నెం-1: డబ్బును ఎప్పటికీ కోల్పోవద్దు, రూల్ నెం-2: నియమాలను ఎప్పటికీ మర్చిపోవద్దు
* ఇతరులు ప్రయోజనం పొందుతున్నప్పుడు మీరు అత్యాశతో ఉండాలి. ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడటానికి ప్రయత్నించాలి.
* అవసరం లేని వస్తువులు కొంటూనే ఉంటే ఏదో ఒక రోజు కావాల్సినవి అమ్ముకోక తప్పదు.
వారెన్ బఫెట్ నేర్పిన ఈ విలువైన ఆర్థిక పాఠాలు ప్రతి ఇంటికీ అవసరమే. వీటిలో ఉన్న సరైన అర్థాన్ని తెలుసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకోవటం చాలా కీలకం. అప్పుడే ఆర్థికంగా సరైన మార్గంలో జీవితాన్ని ముందుకు సాగించగలుగుతాం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications