Gold: ఈ వారం బంగారం కొనాలా..? వద్దా..? ఈ 5 విషయాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి..

Gold: రేటు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గని వస్తువు అంటే మనదేశంలో బంగారం అని చెప్పుకోవాలి. అయితే అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం గత నాలుగు వారాల పాటు పెరిగినప్పటికీ.. ఈ మధ్య కాలంలో తగ్గుదలను నమోదు చేస్తోంది.

బంగారం దారెటు..?

బంగారం దారెటు..?

ఔన్స్ బంగారం 1800 డాలర్ల వద్ద రెసిషన్ ఎదుర్కోవటంతో అమ్మకాల ఒత్తిడి వచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాత్కాలికంగా ధర తగ్గినప్పటికీ వచ్చే సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర దేశంలో రూ.60,000 మార్కును చేరుకుంటుందని తాజాగా బంగారం మైనింగ్ దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో గడిచిన వారంలో MCX బంగారం ధరలు 2 శాతానికి పైగా కరెక్షన్ కు గురయ్యాయి. అయితే స్పాట్ బంగారం ధర 3 శాతానికి పైగా పడిపోయింది.

ద్రవ్యోల్బణం కారణంగా..

ద్రవ్యోల్బణం కారణంగా..

డాలర్ ఇండెక్స్ పెరుగుదల కారణంగా గోల్డ్ రేటులో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా బంగారం ధర మూడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని విశ్వసించే వరకు విధాన రూపకర్తలు వడ్డీ రేట్లను పెంచడానికి కట్టుబడి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. జూలై ఫెడ్ మినిట్స్ మార్కెట్ వర్గాలు దృష్టి సారించటంతో డాలర్ మరింతగా బలపడుతోంది.

వచ్చే వారం కీలకం..

వచ్చే వారం కీలకం..

US ఫెడ్ డాలర్ ఇండెక్స్‌పై అంచనాలను కఠినతరం చేసిన తర్వాత.. బంగారం ధరలకు మరిన్ని సూచనలను అందించే వచ్చే వారం 25 నుంచి 27 ఆగస్టు వరకు షెడ్యూల్ చేయబడిన జాక్సన్ హోల్ సింపోజియం వైపు ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. సమీప కాలంలో బంగారం ధరపై ప్రభావం చూపే టాప్- 5 విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

1] జాక్సన్ హోల్ సింపోజియం:

1] జాక్సన్ హోల్ సింపోజియం:

వార్షిక కాన్ఫరెన్స్‌లో, ఫెడ్ చైర్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రసంగం రాబోయే నెలల్లో రానుంది. ఇందులో US అరువు ఖర్చులు ఎంత ఎక్కువగా ఉండవచ్చో, పెరుగుతున్న ధరలపై పోరాటం ఎంత కాలం కొనసాగుతుందనే విషయాలు ఇందులో ఉండనున్నాయి. ఇది బంగారం ధరకు మార్గనిర్ధేశకంగా నిలుస్తాయని రెలిగేర్ బ్రోకింగ్‌లో కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా అన్నారు.

2] డాలర్ ఇండెక్స్:

2] డాలర్ ఇండెక్స్:

డాలర్ ఇండెక్స్ ట్రెండ్‌పై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఎందుకంటే.. ఇది వారంలో బంగారం ధరలను ఎక్కువగా నడిపిస్తుంది కాబట్టి. ప్రస్తుతం ఇండెక్స్ 108 మార్క్ వద్ద కీలక అడ్డంకిని కలిగి ఉంది. ఈ మార్క్ పైన నిలదొక్కుకోగలదో లేదో చూడాలని సుగంధ సచ్‌దేవా పేర్కొన్నారు.

3] యూఎస్ GDP డేటా:

3] యూఎస్ GDP డేటా:

US Q2 GDP డేటా మూడవ అంచనా వచ్చే వారం విడుదల కానుంది. ఈ డేటా కోసం బంగారం పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఇది US ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం గురించి గోల్డ్ ఇన్వెస్టర్లకు స్పష్టతను ఇస్తుంది. అప్పుడు US డాలర్‌లో ప్రాఫిట్-బుకింగ్ ట్రిగ్గర్ కారణంగా బంగారంపై కొనుగోలు ఆసక్తిని పెంచవచ్చని IIFL సెక్యూరిటీస్‌లో పరిశోధన వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా వెల్లడించారు.

4] US ట్రేడ్ బ్యాలెన్స్:

4] US ట్రేడ్ బ్యాలెన్స్:

"జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ప్రిలిమినరీ హోల్ సేల్ ఇన్వెంటరీ, ట్రేడ్ బ్యాలెన్స్ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బలహీనమైన ట్రేడ్ బ్యాలెన్స్ డేటా US డాలర్‌ను ఒత్తిడికి గురిచేయవచ్చు, ఇది బంగారం ధరల పెరుగుదలకు దారితీయవచ్చని IIFL సెక్యూరిటీస్‌కి చెందిన అనూజ్ గుప్తా అభిప్రాయపడ్డారు.

5] US గృహ విక్రయాలు, జాబ్ డేటా

5] US గృహ విక్రయాలు, జాబ్ డేటా

అమెరికా ఆర్థిక డేటా విడుదల బంగారం ధరల్లో అస్థిరతను మరింత పెంచుతాయి. వచ్చే వారం US, యూరోపియన్ మ్యానుఫ్యాక్ఛరింగ్ డేటా, US సేవల PMI, కొత్త గృహ విక్రయాలు, ప్రధాన మన్నికైన వస్తువుల ఆర్డర్‌లు, ప్రధాన PCE ధర సూచికను కలిగి ఉంటుంది. గోల్డ్ కొనుగోలు చేయటానికి ఇవన్నీ కీలకంగా మారనున్నాయి.

అంతర్జాతీయంగా గోల్డ్ ఇన్వెస్టర్లు తమ బంగారాన్ని అమ్మాలా, కొత్త పెట్టుబడులు పెట్టాలా అనే విషయాలను వీటి ఆధారంగానే నిర్ణయించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో కంగారు పడకుండా అన్ని వివరాల ఆధారంగా ముందుకు సాగాలని వారు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+