IPO News: ఈవీ ఐపీవోలో తుఫాను బూమ్.. బెట్టింగ్ కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
Exicom Tele Systems IPO: భారత్ వేగంగా తన రవాణా వ్యవస్థలో ఈవీలను ప్రవేశపెట్టే దిశగా పలు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి అనేక సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఈవీ రంగంలోని కంపెనీ ఒకటి తాజాగా తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు ముందుకొస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జర్ల తయారీ వ్యాపారంలో ఉన్న ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. రానున్న వారంలో ఈ ఐపీవో ఇష్యూ దేశీయ రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఐపీవో ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు పెట్టుబడిదారుల కోసం తెరవబడుతోంది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వస్టర్లకు ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 26న అందుబాటులోకి రానుంది. షేర్ ఇష్యూ ధర దాదాపు రూ.140గా ఉండవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఇంకా ఇష్యూ ధరను ప్రకటించనప్పటికీ గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.55 ప్రీమియం రేటుకు ట్రేడవుతున్నాయి.

ఈవీ రంగంలో ఉన్న కంపెనీ తన ఐపీవో ద్వారా మెుత్తంగా రూ.329 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని వెల్లడైంది. కంపెనీ ప్రమోటర్లకు చెందిన దాదాపు 70.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించబడుతున్నాయి. కంపెనీ పవర్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఇది ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జర్ సొల్యూషన్స్, పవర్ సొల్యూషన్స్ బిజినెస్ అనే రెండు వ్యాపార విభాగాలను కలిగి ఉంది.
ప్రస్తుతం కంపెనీలో నెక్స్ట్‌వేవ్ కమ్యూనికేషన్స్ మెజారిటీ వాటాను 76.55 శాతం కలిగి ఉండగా, ప్రమోటర్ గ్రూప్‌లోని హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థలో 7.74 శాతం వాటాను కలిగి ఉంది. మొత్తం మీద ప్రమోటర్లు సమిష్టిగా ఆక్సికామ్ టెలి-సిస్టమ్స్‌లో 93.28 శాతం యాజమాన్య ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ తన షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏకకాలంలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications