Virat Kohli: ఇండియాలో క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిన ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఒకడు. టీమిండియాకు మాజీ కెప్టెన్ కూడా. 35 ఏళ్ల విరాట్ కోహ్లీ మైదానంలోనే కాక పెట్టుబడుల్లో సైతం మంచి స్కోర్ చేస్తున్నాడు.
మీడియా కథనాల ప్రకారం కింగ్ కోహ్లీ సంపన విలువ రూ.1,000 కోట్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. విరాట్ కోహ్లి తన డబ్బును చాలా స్టార్టప్ కంపెనీల్లో డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. భార్య అనుష్కతో కలిసి విరాట్ మెుక్కల ఆధారంగా మాంసాన్ని తయారు చేసే బ్లూ ట్రైబ్ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. పైగా కంపెనీకి వారే బ్లాండ్ అంబాసిడర్లు కూడా. అలాగే 2015లో జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటుకు చిసెల్ ఫిట్‌నెస్, CSEతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం సుమారు 90 కోట్లు వెచ్చించాడు.

అలాగే దేశీ కాఫీ బ్రాండ్ రేజ్ కాఫీలో పెట్టుబడి పెట్టాడు. దిల్లీ కేంద్రంగా పనిచేసే కంపెనీ దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. ఇది స్టార్‌బక్స్, నెస్కేఫ్‌లకు గట్టి పోటీనిస్తోంది. సచిన్‌తో పాటు.. విరాట్ కోహ్లీ యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.19.3 కోట్లను పెట్టుబడి పెట్టాడు. 2021లో గ్లోబల్ వెల్నెస్ బ్రాండ్ హైపెరిస్‌లో పెట్టుబడి పెట్టడమే కాక దాని బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు.
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ 2020లో డిజిటల్ ఇన్సూరెన్స్‌లో రూ.2.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇది కెనడియన్ భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ ప్రేమ్ వాట్స్ స్టార్టప్. అలాగే పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఇన్సూరెన్స్ స్టార్టప్ కంపెనీ డిజిట్‌లో రూ.2.5 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ జంట కంపెనీలో 0.25% వాటాను కలిగి ఉన్నారు. కోహ్లీ లండన్ సోషల్ మీడియా స్టార్టప్ స్పోర్ట్ కాన్వోలో కూడా పెట్టుబడులను కలిగి ఉన్నాడు. ఈ సంస్థ అథ్లెట్లు, వారి అభిమానుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.

2019లో కోహ్లీ బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ గెలాక్టస్ ఫన్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ మొబైల్ ప్రీమియర్ లీగ్(MPL)ని నడుపుతోంది. ఈ కంపెనీతో కోహ్లీ 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2020లో కంపెనీ టీమ్ ఇండియా అధికారిక కిట్ స్పాన్సర్, వ్యాపార భాగస్వామిగా మారింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications