Credit Card Portability: కొత్త డిజిటల్ సేవలు విస్తరిస్తున్న వేళ.. రిజర్వు బ్యాంక్ వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కార్డు వినియోగదారుల కోసం నయా సర్వీస్ ప్లాన్ చేస్తోంది.
డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డ్‌ల జారీపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందులో కస్టమర్‌లు వారి జారీ చేసే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలతో కొనసాగడానికి బదులుగా వారు కోరుకున్న కార్డ్ నెట్‌వర్క్ కు మారేందుకు వెసులుబాటు కలగనుంది. ఈ ఎంపికను వినియోగదారులు జారీ చేసే సమయంలో లేదా తర్వాత ఉపయోగించుకోవచ్చని RBI స్పష్టం చేసింది.

ఉదాహరణకు వీసా, మాస్టర్ కార్డ్, రూపే వంటి కార్డ్ జారీదారులు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌లలో కార్డ్‌లను జారీ చేస్తారు. బహుళ కార్డ్ నెట్‌వర్క్‌లలో దేనినైనా ఎంచుకోవడానికి వినియోగదారులకు ఆప్షన్ అందించాలని సెంట్రల్ బ్యాంక్ యోచిస్తున్నట్లు డ్రాఫ్ట్ సర్క్యులర్ ద్వారా వెల్లడైంది. ప్రతిపాదిత నియమాలు క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్‌లను జారీ చేసే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తిస్తాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
దీని ప్రకారం అక్టోబరు 1, 2023 నుంచి కార్డులు జారీ చేసే సంస్థలు తమ కస్టమర్లకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. తద్వారా ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు వినియోగదారులు మారవచ్చు. ప్రస్తుతం దేశంలో కార్డు వినియోగదారులు వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ నెట్‌వర్క్‌లకు యాక్సెస్ కలిగి ఉన్నారు. తాజా ముసాయిదా పోటీతత్వాన్ని పెంచటానికి తోడ్పడనుంది. అయితే ఆగస్టు 4లోగా వాటాదారుల అభిప్రాయాన్ని ఆహ్వానిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.
ఏప్రిల్ 2023 నాటికి బ్యాంకులు 8.65 కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. RBI డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ.2 లక్షల కోట్లకు పెరిగాయి. నెలవారీ క్రెడిట్ చెల్లింపులు ప్రతి నెలా రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 నెలలో కార్డ్ చెల్లింపులు రూ. 1.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications