Success Story: ప్రపంచవ్యాప్తంగా తెలివైన, విజయవంతమైన పెట్టుబడిదారునిగా వారెన్ బఫెట్ గుర్తింపు పొందారు. ఆర్థిక ప్రపంచంలో ఆయన తనదైన ముద్రను వేశారు. ఇన్వెస్ట్మెంట్ ద్వారా సంపదను పెంచుకోవాలనుకునే ప్రతిఒక్క పెట్టుబడిదారుడు ఆయనను అనుకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం 92వ ఏటలో ఉన్న బఫెట్ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రజలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. బఫెట్ మాదిరిగా సక్సెస్ కావాలనునే చాలా మంది వ్యక్తులు అతని పెట్టుబడి వ్యూహాన్ని కాపీ చేసేందుకు ప్రయత్నించారు. ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే దీనిని మెుహ్నిష్ పాబ్రాయ్ అనే భారతీయుడు అందుకోవటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. బఫెట్ పెట్టుబడి సూత్రాన్ని అనుసరించడానికి భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త ప్రయత్నించి విజయవంతమయ్యారు.

అలా కోటీశ్వరుడిగా మారిన మోహ్నిష్ నేడు ప్రముఖ పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందారు. 58 ఏళ్ల ఈ వ్యాపారవేత్త.. తన స్నేహితుడు, తోటి పెట్టుబడిదారుడు గై స్పియర్‌తో కలిసి 2008లో వారెన్ బఫెట్‌తో కలిసి లంచ్ గెలవడానికి 6,50,000 డాలర్లను వెచ్చించారు. దక్షిణ పేరుతో మోహ్నిష్ చేస్తున్న ఛారిటబుల్ కార్యక్రమాలకు గాను మార్చి 2022లో వారెన్ బఫ్ఫెట్ ప్రశంసలు అందుకున్నాడు. పాబ్రాయి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ధంధో ఫండ్స్ వ్యవస్థాపకుడు, జూన్ 2022 నాటికి రూ.1,185.62 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు.
"నేను సిగ్గులేని కాపీ క్యాట్‌ని" అని మొహ్నీష్ పాబ్రాయ్ సంకోచం లేకుండా ఒప్పుకున్నారు. తనకు అసలు ఆలోచనలు లేవని, తన జీవితంలో ప్రతిదీ క్లోన్ చేయబడిందేనని చెప్పుకొచ్చారు. మోహ్నీష్ పాబ్రాయ్ తన ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లడానికి ముందు ముంబైలో పుట్టి పెరిగారు. అతను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ వేగంగా వ్యాపారానికి మారి 1991లో IT కన్సల్టెన్సీ కంపెనీ ట్రాన్స్‌టెక్‌ను స్థాపించి తన ప్రస్థానాన్ని మెుదలు పెట్టారు.


Click it and Unblock the Notifications