BSNL Recharge: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోందంటే బీఎస్ఎన్ఎల్ హవా నడుస్తోందని తెలుస్తోంది. ఇటీవల ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు తమ టారిఫ్ రేట్లను పెంచటంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు.
ఇప్పటికే దేశీయంగా బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ సహకారాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా కంపెనీ కోసం 4జీ సాంకేతికతను సంసిద్ధం చేస్తోంది. మరోపక్క ప్రైవేటు ఆటగాళ్లతో పోటీపడటంలో తగ్గేదే లే అన్నట్లుగా కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలుకు క్యూ కడుతున్నారు.

తాజాగా కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ 13 నెలల కాలపరిమితితో 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రయోజనాలను పరిశీలిస్తే.. ముందుగా బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ధరను రూ.2,399గా ప్రకటించింది. దీనికి సగటున నెలకు ధర రూ.190గా ఉంది. అలాగే ప్లాన్ కింద వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందించటంతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ అందిస్తున్న ప్లాన్.. జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రోటెల్ ప్రయోజనాలను బండిల్ చేస్తోంది.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వివరాలు ఇవే..
టెలికాం వినియోగదారులను ఆకర్షిస్తున్న మరో ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్ వినియోగదారులకు ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా 600జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది.


Click it and Unblock the Notifications