Home Loan: తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్.. ఏఏ బ్యాంకులు ఇస్తున్నాయంటే..??
Home Loan: భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడు కావాలనుకునేవి కూడు, గూడు, గుడ్డ. ఇవి కనీస అవసరాలుగా చాలా మందిగా మనం భావిస్తుంటాం. అందుకే జీవితాంతం కష్టపడిన సొమ్ముతో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలో అనేక మంది హోమ్ లోన్స్ తీసుకుంటుంటారు.
ముందుగా మంచి వడ్డీకి గృహ రుణాలను ఆఫర్ చేస్తున్న వాటిలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంక్ ఉంది. ఇది 8.50 శాతానికే హోమ్ లోన్స్ ఇస్తోంది. అయితే ఇదే రేటుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ సైతం రుణ గ్రహీతలకు ఆఫర్ చేస్తున్నాయి. దీని తర్వాత ఐడీబీఐ బ్యాంక్ 8.55 శాతం వడ్డీ రేటుకు లోన్ అందిస్తోంది. అయితే మంచి సిబిల్ స్కోర్ ఉండే వ్యక్తులకు కొంత తక్కువ రేట్లకే హోమ్ లోన్స్ పొందే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సైతం 8.7 శాతం వరకు వివిధ రేట్లకు హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ఇదే సమయంలో 9 శాతం కంటే తక్కువ రేట్లకు లోన్ అందిస్తున్న జాబితాలో కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లు ఉన్నాయి. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్న తరుణంలో ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 9 శాతానికి మించి వడ్డీ రేట్లకు ప్రస్తుతం మార్కెట్లో లోన్స్ అందిస్తున్నాయి.
మరో ఆరు నెలల కాలంలో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల వేడి తగ్గే అవకాశం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం సైతం తగ్గిన వేళ క్రమంగా రేట్లను రిజర్వు బ్యాంక్ తగ్గించే ప్రక్రియను ప్రారంభించొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాదిలో హోమ్ లోన్ తీసుకోవాలనుకునే చాలా మందిపై భారం తగ్గవచ్చని, ఇప్పటి కంటే తక్కువ రేట్లకే లోన్స్ పొందే అవకాశం లభిస్తుందని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications