Amitabh Bachchan: బాలీవుడ్ నటుల్లో అమితాబ్ బచ్చన్ ప్రజాధరణ ఎక్కువగా ఉన్న నటుడు. ఆయన కేవలం రూ.500 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మెుత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.3,600 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. 1999లో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావటంతో దివాళా తీసిన అమితాబ్.. నిరంతర కృషితో ధనవంతుల జాబితాలో నిలిచారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు, ఖరీదైన సంపద గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ స్థానంలో..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ తర్వాత 'బచన్ బ్యాక్ టు ది బిగినింగ్' పేరుతో ప్రత్యేక చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దశలో అమితాబ్ బచ్చన్ ఏడాదికి రూ.60 కోట్లు సంపాదిస్తున్నారు.

సినిమా రెమ్యూనరేషన్..
అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని, బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ సహా పలు స్టార్టప్ వ్యాపారాల్లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లు కూడా తెలుస్తోంది.

ముంబైలో ఆస్తులు..
బచ్చన్‌కు ముంబై నగరంలో జల్సా, జనక్, ప్రతీక్ష, వాట్స్ అనే నాలుగు బంగ్లాలు ఉన్నాయి. నగరంలోని జుహు ప్రాంతంలో ఉన్న జల్సా బంగ్లాలో అమితాబ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నివాసం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

విలువైన పెయింటింగ్..
అమితాబ్ బచ్చన్ బంగ్లాలో 'షాహెన్షా' పెయింటింగ్‌కు రూ.4 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ఇదేసమయంలో లగ్జరీ కారు బ్రాండ్లైన లెక్సస్, రోల్స్ రాయల్ ఫాంటమ్, బిఎమ్‌డబ్ల్యూలు, మెర్సిడెస్ ఆయన గ్యారెజ్ లో ఉన్నాయి. వీటి సంఖ్య మెుత్తం 11 గా ఉంది. ఇదే సమయంలో ఆయనకు రూ.260 కోట్లు విలువచేసే ప్రత్యేక జెట్ విమానం కూడా ఉంది.

దివాలా తీసిన అమితాబ్..
నటుడు అమితాబ్ బచ్చన్ 1999లో బెంగుళూరులో జరిగిన ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించేందుకు చాలా డబ్బు వెచ్చించారు. కానీ కొన్ని సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో షోను రద్దు చేశారు. ఫలితంగా.. అమితాబ్ బచ్చన్ భారీ నష్టాలను చవిచూశారు.
అలా ఆయన ఆర్థికంగా దివాలా తీయవలసి వచ్చింది. ఆ సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్ కాలేజీ ఫీజు కూడా కట్టలేని స్థితికి ఆయన చేరుకున్నారు. పైగా సొంతంగా సినిమాలు నిర్మించి కూడా నష్టాలనే తెచ్చిపెట్టింది. అయితే కౌన్ భనేగా కరోడ్ పతి కార్యక్రమం ఆయనను ఆర్థికంగా గాడిలో పడేందుకు సహాయం చేసింది.


Click it and Unblock the Notifications