High FD Rate: 9.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు.. ఈ 7 బ్యాంకుల్లో ఎఫ్‌డి చేశారా..
High FD Rate: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో సీనియర్ సిటిజన్లకు గతంలో ఎన్నడూ చూడని రీతిలో మంది వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో గరిష్ఠంగా 9.5 శాతం వడ్డీని అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.50% వడ్డీని చెల్లిస్తోంది.
2. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు 2 నుంచి 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.10% వడ్డీని అందిస్తోంది.

3. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల వరకు కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.10% వడ్డీని ఆఫర్ చేస్తోంది.
4. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ 3 సంవత్సరాల వరకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.10% వరకు వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది.
5. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 750 రోజుల FDపై 9.11% వడ్డీని అందుబాటులో ఉంచింది.
6. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9% వడ్డీని చెల్లిస్తోంది.
7. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
చివరగా ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి చేసే డిపాజిట్లకు గాను 9% వడ్డీని ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications