IPO News: 2023లో నెలలు మారుతున్న కొద్దీ మార్కెట్లోకి వస్తున్న ఐపీవోల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. నిరంతరాయంగా ఐపీవోలు మార్కెట్లోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు మరో నాలుగు ఐపీవోలు అందుబాటులోకి రానున్నాయి. వివరాల్లోకి వెళితే..
ముందుగా సెప్టెంబర్ 13న ఆర్ఆర్ కేబుల్ కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. పెట్టుబడిదారులు పాల్గొనేందుకు ఇది సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉండనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 12న తెరవబడుతోంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.983-1035గా నిర్ణయించింది. ఆదివారం గ్రేమార్కెట్లో షేర్ ప్రీమియం ధర రూ.260గా కొనసాగుతోంది. ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.1,964 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రెండవ ఐపీవోగా సంఝీ హోటల్స్ ఎస్ఎమ్ఈ కేటగిరీలో సెప్టెంబర్ 14న ప్రారంభం అవుతోంది. దీని సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 18న ముగుస్తుంది. రూ.1200 కోట్ల విలువైన తాజా షేర్లను, 1.35 కోట్ల షేర్లను విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే కంపెనీ IPO ధరను ఇంకా ప్రకటించలేదు. కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ.119-126గా ప్రకటించింది. అలాగే ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,370 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.
ఇక జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ ఐపీవో సెప్టెంబర్ 14న ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతోంది. ఈ ఐపీవోలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 18 వరకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇది సెప్టెంబర్ 13నే అందుబాటులో ఉండనుంది. ఈ ఫిన్ టెక్ కంపెనీ సైతం తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ను రూ.156-164గా ప్రకటించింది.
ఇక ఈవారం చివరగా తెరవబడుతున్న ఐపీవో చావ్డా ఇన్‌ఫ్రా. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ.43.26 కోట్లును సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.60-65గా నిర్ణయించింది. సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 14 వరకు IPOలో పెట్టుబడిదారులు పాల్గొనటానికి అవకాశం ఉంది. ఆదివారం కంపెనీ స్టాక్ గ్రేమార్కెట్ ప్రీమియం రూ.45గా ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications