IPOs this Week: ఈవారం మార్కెట్లోకి 16 ఐపీవోలు.. గెట్ రెడీ ఇన్వెస్టర్స్.. పూర్తి వివరాలు..
IPO News: భారతీయ ప్రైమరీ మార్కెట్ డిసెంబరులో మరో బిజీ వారానికి సిద్ధమవుతోంది. కొత్త ఐపీవో ఆఫర్లతో పాటుగా, అనేక లిస్టింగ్స్ కూడా ఈ వారం సందడికి కారణంగా నిలవనుంది.
వాస్తవానికి 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన ఐపీవోలలో ఎక్కువ శాతం ఎస్ఎమ్ఈ కేటగిరీలోని కావటం గమనార్హం. రిటైల్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన బలమైన డిమాండ్‌తో గణనీయమైన ప్రీమియం ధరల వద్ద జాబితా చేయబడ్డాయి. పబ్లిక్ ఇష్యూ కోసం వస్తున్న 6 ఐపీవోల వివరాలను పరిశీలిస్తే..

ఈవారం మార్కెట్లో AIK పైప్స్ అండ్ పాలిమర్స్ ఐపీవో ఇష్యూ డిసెంబర్ 26న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం అవుతోంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.15 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 27న తెరుచుకోనున్న ఆకాంక్ష పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో తన ప్రైస్ బ్యాండ్ ధర రూ.52-55గా నిర్ణయించింది. ఇదే రోజున మనోజ్ సిరామిక్ ఐపీవో ప్రారంభించనుంది. ఈ క్రమంలో రూ.14.47 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇదే వారంలో డిసెంబర్ 29న HRH నెక్స్ట్ సర్వీసెస్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతోంది. అలాగే 27న స్టార్ట్ అవుతున్న శ్రీ బాలాజీ వాల్వ్ కాంపోనెంట్స్ రూ.21.60 కోట్లను, డిసెంబర్ 28న ప్రారంభం అవుతున్న కే సీ ఎనర్జీ & ఇన్‌ఫ్రా ఐపీవో రూ.15.93 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.
ఈవారం మార్కెట్లో లిస్టింగ్ కోసం వస్తున్న 10 ఐపీవోల వివరాలను పరిశీలిస్తే..
- సహారా మారిటైమ్ ఐపీవో డిసెంబర్ 26న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీవో డిసెంబర్ 26న మార్కెట్లో జాబితా చేయబడుతోంది.
- మోటిసన్స్ జ్యువెలర్స్ ఐపీవో డిసెంబర్ 26న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో డిసెంబర్ 26న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- ఎలక్ట్రో ఫోర్స్ (భారతదేశం) ఐపీవో డిసెంబర్ 26న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీవో డిసెంబర్ 27న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- RBZ జ్యువెలర్స్ ఐపీవో డిసెంబర్ 27న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- హ్యాపీ ఫోర్జింగ్స్ ఐపీవో డిసెంబర్ 27న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- శాంతి స్పింటెక్స్ ఐపీవో డిసెంబర్ 27న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.
- ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవో డిసెంబర్ 28న మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది.


Click it and Unblock the Notifications