Mutual Funds: మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మంచి రాబడులను అందించే కంపెనీలను ఎంచుకుని మరీ పెట్టుబడులను పెడుతుంటాయి. ఈ క్రమంలో గడచిన మూడేళ్లుగా చాలా మంది ఈక్విటీ మార్కెట్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు.
గడచిన మూడేళ్లుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ భారీగా రాబడులను అందిస్తున్నాయి. ఈ కేటగిరీ ఫండ్స్ ఇన్వెస్టర్లకు 35 శాతం రాబడిని అందిస్తూ రెండవ స్థానంలో నిలిచాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై భారత ప్రభుత్వం దృష్టి సారించడం.. కంపెనీల మెరుగైన పనితీరు వెనుక ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ మెచ్చిన 13 స్మాల్‌క్యాప్ ఇన్‌ఫ్రా ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. నిర్మాణ రంగంలో ఉన్న PNC Infratech కంపెనీ షేర్లను 11 మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి.
2. నిర్మాణ రంగానికి చెందిన GR Infraprojects షేర్లను 8 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కొనసాగిస్తున్నాయి.
3. ఇన్ ఫ్రా రంగానికి చెందిన KNR Constructions స్టాక్ ను 7 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కలిగి ఉన్నాయి.
4. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన KEI Industries కంపెనీ షేర్లను 7 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కొనుగోలు చేశాయి.
5. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి చెందిన MTAR Technologies షేర్లను 7 మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిస్తున్నాయి.
6. రియల్టీ రంగానికి చెందిన Brigade Enterprises కంపెనీ షేర్లలో 7 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హోల్డ్ చేస్తున్నాయి.
7. పవర్ రంగానికి చెందిన Kalpataru Projects International షేర్లను 7 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొనసాగిస్తున్నాయి.
8. కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రంగంలోని H.G. Infra Engineering షేర్లలో ఏడు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కలిగి ఉన్నాయి.
9. నిర్మాణ రంగంలో ప్రఖ్యాత NCC కంపెనీ షేర్లను 7 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడులను కలిగి ఉన్నాయి.
10. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన Tega Industries షేర్లలో 6 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కలిగి ఉన్నాయి.
11. ఎలక్ట్రికల్ ఎక్యుప్మెంట్ రంగానికి చెందిన TD Power Systems కంపెనీలో 6 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి.
12. గ్యాస్ రంగానికి చెందిన Gujarat State Petronet కంపెనీ షేర్లను 6 మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉన్నాయి.
13. సిమెంట్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన Birla Corporation షేర్లను 6 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హోల్డ్ చేస్తున్నాయి.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి పెట్టుబడులను చేయకండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications