Fixed Deposit: ప్రస్తుతం దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి, డబ్బును దాచుకోవాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వడ్డీ రేట్లు గరిష్ఠాలకు చేరుకున్న వేళ చాలా మంది తమ డబ్బును అధిక రాబడిని అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పార్క్ చేసేందుకు తమ అన్వేషణ కొనసాగిస్తున్నారు.
పెట్టుబడిపై కొంత రాబడి తక్కువగా ఉన్నప్పటికీ.. సురక్షితమైన పెట్టుబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇప్పటికీ కస్టమర్ల ఫస్ట్ ఆఫ్షన్‌గా నిలిచింది. మీరు కూడా FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా బంపర్ రాబడిని పొందాలనుకుంటే.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాతలు, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ వినియోగదారులకు మంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఏడాది కాలానికి డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే FDపై అత్యధిక వడ్డీని అందించే 10 బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గరిష్ఠంగా 7.75% వడ్డీ:
- ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని DCB బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7.25% వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75% వడ్డీని ఆఫర్ చేస్తోంది.
- తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు ఏడాది కాలానికి చేసే FDపై 7.25% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
- కెనరా బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అత్యధికంగా 7.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది.
- డ్యుయిష్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే వడ్డీని చెల్లిస్తోంది.
- అలాగే కర్ణాటక బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.40% వడ్డీని ఇప్పటికే అందిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ ఆఫర్:
- RBL బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.50% వడ్డీని ఇస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.50% వడ్డీని ఇస్తోంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 6.80% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.30% వడ్డీని అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 6.75% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25% వడ్డీని అందిస్తోంది.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కస్టమర్లకు 6.75% వడ్డీని, 1 సంవత్సరం FDపై తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25% వడ్డీని ఇస్తోంది.


Click it and Unblock the Notifications