Airtel Plans: ఎయిర్‌టెల్ తన కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లను డిజైన్ చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా 35 రోజుల కోసం సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో నెల రోజులు గడువు ఎప్పుడవుతుందా అని ఆలోచన లేకుండా ఈ ప్లాన్ కాపాడుతుంది.
లాంగ్ పీరియడ్ ప్లాన్ కోసం చూస్తున్న ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ.289తో అందుబాటులో ఉంది. ప్లాన్ కింద SMS, కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 SMS సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు.

ఈ కొత్త రూ.289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంట్లో WiFiని కలిగి ఉంటే లేదా మీ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మాత్రమే రీఛార్జ్ చేస్తే.. ఈ రూ.289 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే క్రమంలో ఎయిర్ టెల్ చౌక ప్లాన్ రూ.19కి అందుబాటులో ఉంది. ఈ టాపప్ కింద ఒక రోజుకి 1GB డేటాను అందిస్తుంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ వాలిడిటీ కూడా ఒక్కరోజు మాత్రమే.
Airtel చౌకైన ప్లాన్ ధర రూ.29. ధర పరంగా ఈ ప్లాన్ చిన్న రీఛార్జ్ అయినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైన ప్లాన్. కేవలం రూ.29 టాప్-అప్ ప్లాన్‌లో మీరు మొత్తం 24 గంటలపాటు అంటే ఒక రోజుకి 2GB ఇంటర్నెట్‌ని పొందుతారు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ వాలిడిటీ కూడా ఒక్క రోజు మాత్రమే.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications