కేంద్ర బడ్జెట్ 2025: గత బడ్జెట్లో ఏపీకి నిర్మలమ్మ వారల జల్లు.. థ్యాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు..
Chandrababu Naidu: జూలై 23, 2024న కేంద్రంలోకి మోదీ సర్కార్ మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. అయితే అది పూర్తి సంవత్సరానికి కాకుండా కొంత కాలం కోసం తెచ్చిన మధ్యంతర బడ్జెట్. ఆ సమయంలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ అధికారంలో ఉన్న ఏపీకి కూడా కొన్ని ప్రకటనలు చేశారు.
గత బడ్జెట్ సమయంలో వెనుకబడిన జార్ఖండ్ తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. దీంతో చాలాకాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తిరిగి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. వివిధ ఆర్ధిక సంస్థల నుంచి దీనికి అవసరమైన నిధులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదే క్రమంలో ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

దేశ ఆహార భద్రతకు పోలవరం కీలకమని.. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాపై దృష్టిసారిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీలో పారిశ్రామిక కారిడార్లను నిర్మించటానికి కూడా సహాయం చేస్తామని నిర్మలమ్మ అప్పట్లో వెల్లడించారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి తగిన ప్రయోజనాలను అందిస్తామని ఆర్థిక మంత్రి గత బడ్జెట్ ప్రసంగం సమయంలో హామీ ఇచ్చారు.
వాస్తవానికి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో రూ.15,000 కోట్లను వివిధ సంస్థల ద్వారా పొందేందుకు సహాయం చేస్తుందంది అని చెప్పారు. కానీ ఇది విన్న అందరూ బడ్జెట్లో నేరుగా డబ్బు కేటాయించిందని భ్రమపడ్డారు. ఇదే సమయంలో బిహార్ కోసం బడ్జెట్లో రూ.26,000 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఏపీకి నిధులు సమకూర్చేందుకు సహాయాన్ని అందరూ కేంద్రం నుంచి నిధులుగా పొరపాటు పడ్డారు.
వాస్తవానికి ఏపీలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుపై నమ్మకం కంటే పవన్ పై ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోపక్క చంద్రబాబు మాత్రం సమయానుకూలంగా ప్రతి సందర్భంలోనూ పవర్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది జనసేనను కంట్రోల్ చేసేందుకేనా అనే అనుమానాలను రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏపీలో లోకేష్ చరిష్మాకు దెబ్బతీస్తుందనే వాదనలు సైతం టీడీపీ కేడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications