Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో కీలక అప్డేట్.. మరణించిన వారికి భారీ పరిహారం..!
Tirupati Vishnu Nivasam: తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు భావిస్తుంటారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఎల్లప్పుడూ దర్శనానికి వస్తూనే ఉంటారు. అయితే తాజాగా తిరుపతిలో అపశుృతి చోటుచేసుకుంది. దీనిలో శ్రీవారి భక్తులు ప్రాణాలు కోల్పోవటం సర్వత్రా చర్చకు దారితీసింది.
జనవరి 10న వైకుంఠ ఏకాదశి కారణంగా చాలా మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోవటానికి వెళుతుంటారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా అందించే టిక్కెట్లకు ఎల్లప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలో అధికారులు దాదాపు 90 కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ తిరుపతిలోని విష్ణు నివాసంతో పాటు ఎంజీఎం స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద టిక్కెట్ల కోసం ప్రజలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా 4000-5000 మంది భక్తులు అక్కడ ఉండటం వల్ల తొక్కిసలాట జరిగింది. మరణించిన వారిలో ఒక మహిళను అధికారులు గుర్తించారు. మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారంగా ప్రభుత్వం ప్రకటించింది.

దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు డీఎస్పీ తలుపులు ఒక్కసారిగా తెలవటంతోనే తొక్కిసలాటకు దారితీసినట్లు పేర్కొన్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు దిర్భాంతి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రివ్వూ చేపట్టారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాట వల్ల 6 మంది భక్తులు మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారని వెల్లడైంది. అయితే అధికారుల డేటా ప్రకారం వీరిలో 16 మంది డిస్ఛార్జ్ అయ్యారని వెల్లడైంది. ప్రమాదకరమైన గాయాలు ఎవ్వరికీ కాలేదని వైద్యులు వెల్లడించారు.
దేశంలోని ధనిక ఆలయాలు..
ప్రస్తుతం దేశంలో దాదాపు 9 ధనిక ఆలయాల్లో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ముందు వరుసలోనే ఉంది. దేశంలోని కేరళ తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం తొలి స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో ఆలయ నేల మాళిగల్లో భారీగా బంగారం, వజ్రాలు వంటి నిధి ఉన్నట్లు గుర్తించబడింది. ప్రస్తుతం ఆలయ సంపద లక్ష కోట్లుగా ఉంటుందని అంచనా వేయబడింది. ఇక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల విలువ రూ.650 కోట్లుగా ఉంటుందని లెక్కించబడింది. జమ్మూకశ్మీల్లోని వైష్ణోదేవీ దేవాలం విలువ రూ.500 కోట్లుగా లెక్కించబడింది.
షిరిడి సాయి బాబా ఆలయ సంపద రూ.320 కోట్లు, పంజాబ్ అమృత్ సర్ ఆలయం సంపద విలువ రూ.500 కోట్లు, తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ ఆస్తుల విలువ రూ.6 కోట్లు, కేరళలోని గురువాయూర్ ఆలయ సంపద రూ.2500 కోట్లు, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ సంపద విలువ రూ.150 కోట్లు, అంబానీ కుటుంబం తరచుగా దర్శించి ముంబై సిద్ధి వినాయక ఆలయ సంపద రూ.125 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ఈ ఆలయాలకు ఉండే స్థిరచరాస్థుల మార్కెట్ విలువ అంచనాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications