IPO News: ఈ వారం మార్కెట్లో ఐపీవోల సునామీ.. బెట్టింగ్ బంగార్రాజులకు గుడ్ టైమ్..

Upcoming IPOs: ఈవారం ప్రైమరీ మార్కెట్లోకి కంపెనీ ఐపీవోల వరద కొనసాగనుంది. మెుత్తంగా 9 కొత్త ఐపీవోలు దలాల్ స్ట్రీట్ లోకి అడుగుపెడుతుండగా.. నాలుగు ఐపీవోలు లిస్టింగ్ కోసం వస్తున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లను వీడి ఐపీవోలపై దృష్టి పెద్దిన చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా డబ్బును బెట్టింగ్ కోసం సిద్ధం చేసుకుంటున్నారు. వీటిలో మూడు మెయిన్ బోర్డ్ ఐపీవోలు ఉండగా.. 6 ఎస్ఎమ్ఈ కేటగిరీలో ప్రవేశిస్తున్నాయి.

2004 నుంచి మే నెలలో జనరల్ ఎలక్షన్స్ సమయంలో ఒక్క ఐపీవో కూడా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. ఈ సమయంలో సాధారణంగా మార్కెట్లు చాలా నెమ్మదిగా ఉంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Know 9 IPO s that opening their subscription coming Week amid General election season going

Indegene IPO: కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం మే 6న తెరుచుకుని మే 8న ముగియనుంది. కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,841.76 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు షేర్లను విక్రయించనున్నారు.

TBO Tek IPO: మే 8న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరుచుకోనున్న ఇష్యూ మే 10న ముగియనుంది. అలాగే కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,550.81 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.25 కోట్ల షేర్ల విక్రయానికి ఆఫర్‌తో పాటు మొత్తం రూ.400 కోట్లతో 0.43 కోట్ల షేర్ల తాజా ఇష్యూ ఉంది .

Aadhar Housing Finance IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో మే 8, 2024న బిడ్డింగ్ కోసం తెరవబడుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు మే 10 వరకు అవకాశం ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.3,000 కోట్లను సమీకరించాలని చూస్తోంది. రాబోయే ఐపీవో 3.17 కోట్ల షేర్ల తాజా ఇష్యూతో కలిపి రూ.1,000 కోట్లు, 6.35 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.2,000 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో కంపెనీ సేకరిస్తోంది.

Refractory Shapes IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న రిఫ్రాక్టరీ షేప్స్ ఐపీవో మే 6, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి మే 9, 2024న ముగుస్తుంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.18.60 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.27 నుంచి రూ.31గా కంపెనీ నిర్ణయించింది.

Winsol Engineers IPO: నిన్సోల్ ఇంజనీరింగ్ ఐపీవో మే 6, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. అలాగే మే 9, 2024న ముగుస్తుంది. ఈ ఎస్ఎమ్ఈ ఐపీవో రూ.23.36 కోట్లను సమీకరించేందుకు 31.15 లక్షల తాజా షేర్లను విక్రయిస్తోంది. ప్రైస్ బ్యాండ్ ధర రూ.71-75గా కంపెనీ నిర్ణయించింది.

Finelistings Technologies IPO: ఫైనలిస్టింగ్స్ టెక్నాలజీస్ ఐపీవో మే 7, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడనుంది. మే 9, 2024న ముగుస్తుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.13.53 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం 11 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎస్ఎమ్ఈ ఐపీవో ఒక్కో షేరు విక్రయ ధరను రూ.123గా సెట్ చేసింది.

Silkflex Polymers IPO: సిల్క్‌ఫ్లెక్స్ పాలిమర్స్ ఐపీవో మే 7, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచుకోనుంది. మే 10, 2024న ముగియనున్న ఎస్ఎమ్ఈ ఐపీవో మార్కెట్ల నుంచి రూ.18.11 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పూర్తిగా 34.82 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని చూస్తోంది. ఇందుకోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.52గా ప్రకటించింది.

TGIF Agribusiness IPO: అలాగే ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న TGIF అగ్రిబిజినెస్ ఐపీవో దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం మే 8, 2024న ప్రారంభం కానుంది. మార్కెట్ల నుంచి కంపెనీ రూ.6.39 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించేందుకు 6.88 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.

Energy Mission Machineries IPO: ఎనర్జీ మిషన్ మెషినరీస్ ఐపీవో మే 9, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. మే 13, 2024న ముగుస్తుంది. ఎస్ఎమ్ఈ ఐపీవో మార్కెట్ల నుంచి ఐపీవో ద్వారా రూ.41.15 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం పూర్తిగా 29.82 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో తన షేర్ ప్రైస్ బ్యాండ్ ఇష్యూ ధరను రూ.131-138గా నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+