Investment: కరోనా తర్వాత దేశంలోని బ్యాంకింగ్ రంగం భారీగా లాభాలను నమోదు చేస్తోంది. ప్రైవేటు బ్యాంకులకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు పనితీరును కనబరిచాయి.
ఈ క్రమంలో నిఫ్టీ PSU బ్యాంక్ గత సంవత్సరంలో ఎనిమిది మల్టీబ్యాగర్ బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుదల తర్వాత దాని 2010 గరిష్ట స్థాయిని అధిగమించడానికి సిద్ధంగా ఉంది. నేడు సూచీ 5,145 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ PSU బ్యాంక్ నవంబర్ 2010లో గరిష్ట ముగింపు 5,375.8కి అత్యంత చేరువలో కొనసాగుతోంది.

గత ఏడాది ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న 8 బ్యాంకులు ఇన్వెస్టర్ల సంపదను దాదాపు రెండింతలు చేశాయి. వీటిలో యూకో బ్యాంక్ 270 శాతం రాబడిని అందించి టాపర్‌గా నిలిచింది. ఇదే క్రమంలో పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి.
ఇదే క్రమంలో మార్కెట్లో ప్రస్తుతం కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ అంచనా వేస్తోంది. జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకులు ఊహించిన దాని కంటే మెరుగైన పనితీరు, ఆస్తి నాణ్యతను కలిగి ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అలాగే నిరర్థక ఆస్తులు తగ్గుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కోసం అధిక వ్యాల్యుయేషన్లలో వీటిని కొనకపోవటం మంచిదని బ్రోకరేజ్ హెచ్చరించింది. రానున్న కాలంలో ఎన్పీఏలు పెరగొచ్చని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications