High FD Rate: ప్రస్తుతం దేశంలో రిజర్వు బ్యాంక్ చర్యల కారణంగా అనేక బ్యాంకులు డిపాజిట్లపై ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీంతో సీనియర్ సిటిజన్లకు మంచి సురక్తితమైన పెట్టుబడి కోసం అధిక వడ్డీని చెల్లిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల కాల వ్యవధికి చేసే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.50% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది సీనియర్ సిటిజన్లకు మార్కెట్లో దొరుకుతున్న అత్యుత్తమమైన వడ్డీ రేటుగా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ వెబ్‌సైట్ లోని వివరాల ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణ కోసం 1 శాతం పెనాల్టీ విధించబడుతుందని వెల్లడించింది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సీనియర్ సిటిజన్లకు అత్యుత్తమ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య కాలానికి చేసే FDల బ్యాంక్ 9.10 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే గడువుకు ముందరే తమ డిపాజిట్లను పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నట్లయితే 1 శాతం పెనాల్టీ చెల్లించాలని బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇది ఏడు రోజుల లోపు చేసే ఉపసంహరణలకు వర్తించదని బ్యాంక్ స్పష్టం చేసింది.
FDలపై వడ్డీ రేట్లు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లోని సీనియర్ సిటిజన్‌లకు 9% వరకు వడ్డీ అందుబాటులో ఉంది. కనిష్ట నిర్దేశిత వ్యవధి పూర్తయ్యేలోపు డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణ చేసిన వారికి వడ్డీ చెల్లించబడదు.
సూర్యోదయ్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు 9.10% వరకు వడ్డీని సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తోంది. అలాగే ముందస్తు డిపాజిట్ల ముగింపుపై పెనాల్టీ కూడా ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం 750 రోజుల కాలానికి మెచ్యూర్ అయ్యే FDలకు 9.21% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1095 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై సీనియర్ సిటిజన్‌లకు 9% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే గడువుకు ముందరే డిపాజిట్లను క్లోజ్ చేసుకున్నట్లయితే వడ్డీ రేటుపై 0.5 శాతం పెనాల్డీ వర్తిస్తుందని బ్యాంక్ వెల్లడించింది.
ఇక చివరిగా ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుంచి 3 ఏళ్ల లోపు మెచ్యూర్ అయ్యే FDలపై 9% వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications