Budget News: రానున్న వారం జూలై 23న దేశం మెుత్తం ఎదురుచూస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం కృషి చేస్తోంది. మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ పార్లమెంటు ముందుకు వస్తున్నందున భారీగా ప్రజల్లో, పరిశ్రమ వర్గాల్లో అంచనాలు పెరిగాయి.
ఈసారి ప్రజలు బీజైపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మ్యాన్డేట్ ఇవ్వకపోవటంతో ఎన్డీయే కూటమిలోని పార్టీల సహకారం మోదీ సర్కార్ నిలబడటానికి చాలా కీలకంగా మారింది. అయితే ఈ సారి బడ్జెట్‌ను రూపొందించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అనుభవజ్ఞులైన ఆరుగురు ఆమె బడ్జెట్ ప్రెపరేషన్ టీమ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది.

టివి సోమనాథన్:
నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్‌లో మొదటి పేరు ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శి టీవీ సోమనాథ్. ఆయన తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శి, వ్యయ కార్యదర్శిగా ఉన్నారు. వాస్తవానికి ఈయన మోదీకి అత్యంత సన్నిహితుడిగా పరేగణించబడ్డారు. వాస్తవానికి ఏప్రిల్ 2015 నుంచి ఆగస్టు 2017 వరకు పీఎంవోలో సోమనాథ్ పనిచేశారు. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన సోమనాథన్ ఆర్థికశాస్త్రంపై 80కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. అలాగే ఆయనకు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనుభవం కూడా ఉంది.
అజయ్ సేథ్:
బడ్జెట్ తయారు చేసిన బృందంలోని కర్ణాటక కేడర్‌కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అజయ్ సేథ్ కూడా ఉన్నారు. ఈయన ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సేథ్ భారత్ మొట్టమొదటి సావరిన్ గ్రీన్ బాండ్‌ను జారీ చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్‌ను రూపొందించడంలో ప్రసిద్ది చెందారు. గత ఏడాది భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఇదే చర్చనీయాంశమైంది.
తుహీన్ కాంత్ పాండే:
ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత్ పాండే కూడా నిర్మలా సీతారామన్ బృందంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం(DIPAM) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో పాటు, ఎల్ఐసీ ఐపీవోను ఫ్లోట్ చేయటంలో కీలకపాత్ర పోషించారు.
సంజయ్ మల్హోత్రా:
బడ్జెట్ 2024 తయారీ బృందంలో తదుపరి పేరు రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ అధికారి సంజయ్ మల్హోత్రా కూడా భాగంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఆర్థిక సేవల విభాగానికి అధిపతిగా కొనసాగారు. ఎన్నికలకు ముందు జరిగిన మధ్యంతర బడ్జెట్ ప్రక్రియలో పన్ను ఆదాయాన్ని పెంచడానికి సంజయ్ మల్హోత్రా బాధ్యత వహించారు. ఇది కాకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పార్ట్ టూ ముసాయిదా రూపకల్పనలో పాల్గొంటున్నారు.
వి అనంత్ నాగేశ్వరన్:
నిర్మలమ్మ బడ్జెట్ బృందంలో ఉన్న వి అనంత్ నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు. పైగా ఆయన రచయిత, ఉపాధ్యాయుడు కూడా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సన్నిహిత సలహాదారుల్లో నాగేశ్వరన్ కూడా ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఏదైనా ప్రపంచ పరిణామాల ప్రభావాన్ని నిశితంగా నాగేశ్వరన్ గమనిస్తారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో కూడా కీలక పాత్ర పోషించారు.
వివేక్ జోషి:
ఆర్థిక మంత్రి సీతారామన్ సలహా బృందంలో కొత్తగా హర్యానా కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ IAS అధికారి జోషి నవంబర్ 2022లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేరారు. జెనీవా విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన వివేక్ జోషి గతంలో భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్‌గా పనిచేశారు.


Click it and Unblock the Notifications