Upcoming IPOs: కొత్త నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీవోల కోలాహలం కొనసాగనుంది. పెట్టుబడిదారులు దీనికోసం బెట్టింగ్ వేయటానికి నిధులను సమీకరించుకునే పనిలో ఉన్నారు. ఒకపక్క అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ ఒడిదొడుకులకు లోనవుతున్న వేళ చాలా మంది ఐపీవో మార్కెట్లలో సేఫ్ గేమ్ ఆడటం ద్వారా లాభాలను పొందాలని చూస్తున్నారు.
రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్తగా 3 ఐపీవోలు తమ ఇష్యూని ప్రారంభిస్తుండగా.. ఇప్పటికే మరో 3 ఐపీవోలు సబ్ స్కిప్షన్ కోసం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని ఐపీవోల లిస్టింగ్ కూడా రానున్న వారంలో జరగనున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి వస్తున్న ఐపీవోల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ముందుగా మనం మాట్లాడుకోబోతున్నది అగర్వాల్ టఫ్నెడ్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఇది పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉంది. డిసెంబర్ 2 వరకు ఇష్యూ అందుబాటులో ఉండనుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.62.64 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 58 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా ప్రైస్ బ్యాండ్ రూ.105-108గా ఉంచింది. గ్రేమార్కెట్లో షేర్ రూ.9 ప్రీమియం పలుకుతోంది.
2. ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతున్న మరో ఐపీవో గణేష్ ఇన్‌ఫ్రావరల్డ్. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.98.58 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు కంపెనీ ఇష్యూ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.78-83గా నిర్ణయించింది. కంపెనీ ఐపీవో ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తూ ఎన్ఎస్ఈలో జాబితా కోసం సిద్ధం అవుతోంది.
3. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో సురక్షా క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్. కంపెనీ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.846.25 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఐపీవోలో 1.92 కోట్ల షేర్లు విక్రయించబడుతున్నాయి. కంపెనీ ఐపీవో కోసం తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.420-441గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో డిసెంబర్ 3 వరకు బెట్ వేసేందుకు అందుబాటులో ఉండనుంది.
4. కొత్త నెలలో ఇష్యూ ప్రారంభం కానున్న తొలి ఐపీవో ప్రాపర్టీ షేర్ రీట్. కంపెనీ ఐపీవో ద్వారా రూ.352.91 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 2న ప్రారంభం అవుతున్న ఐపీవో డిసెంబర్ 4 వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ప్రస్తుతం తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రిలీజ్ చేయలేదు.
5. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిసన్ ఫైనాన్స్ సర్వీసెస్ ఐపీవో గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం డిసెంబర్ 4 నుంచి 6 వరకు ఐపీవో అందుబాటులో ఉండనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.114.24 కోట్లు రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.170-180గా నిర్ణయించింది. అలాగే గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.50 ప్రీమియం ధర పెరుగుతుంది.
6. ఇక చివరిగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఐపీవో గురించే. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.90-95గా ఉంచింది. ఐపీవో డిసెంబర్ 5 నుంచి 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.49.26 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉందని ఎస్ఎమ్ఈ ఐపీవో వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications