Upcoming IPOs: ఈవారం 5 ఐపీవోలు.. బెట్టింగ్ చేసేందుకు గెట్ రెడీ ఇన్వెస్టర్స్.. పూర్తి వివరాలు ..
IPO News: ఈవారం మార్కెట్లోకి నాలుగు మెయిన్ స్ట్రీమ్ ఐపీవోలు ఉండగా మరో ఎస్ఎమ్ఈ ఐపీవో ప్రారంభం అవుతున్నాయి. ఇవి మెుత్తంగా మార్కెట్ల నుంచి రూ.2,700 కోట్లను ప్రైమరీ మార్కెట్ల నుంచి సమీకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో లాభాల బెట్టింగ్ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు.
1- అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ ఐపీవో ఫిబ్రవరి 5-7 వరకు తెరచి ఉండనుంది. రూ.600 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ ఉండగా.. రూ.320 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంది. అంటే మెుత్తంగా కంపెనీ తన ఐపీవో నుంచి రూ.920 కోట్లను సమీకరిస్తోంది. అయితే దీనికోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.147-155గా నిర్ణయించింది. ఐపీవో కేటాయింపు ఫిబ్రవరి 8 నాటికి ఖరారు చేయబడుతుంది. లిస్టింగ్ ఫిబ్రవరి 12 నాటికి లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.

2- ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాశి పెరిఫెరల్స్ ఐపీవో గురించే. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.295-311గా నిర్ణయించింది. ఇది ఫిబ్రవరి 7న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో నుంచి కంపెనీ రూ.600 కోట్లను సమీకరిస్తోంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. ప్రముఖ ఇన్వెస్టర్ మాధురీ కేలా కంపెనీలో రూ.50 కోట్ల విలువైన 16.07 లక్షల షేర్లను రూ.311 చొప్పున కొనుగోలు చేశారు. కంపెనీ షేర్లు ఫిబ్రవరి 14న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జాబితా చేయబడనున్నారు.
3- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ఫిబ్రవరి 7న ప్రారంభించనుంది. ఇష్యూ ఫిబ్రవరి 9న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపు ఫిబ్రవరి 6న జరగనుంది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ధర బ్యాండ్ సెట్ చేయబడింది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ రేటును రూ.445-468గా నిర్ణయించింది. అలాగే షేరు లాట్ పరిమాణాన్ని 32 షేర్లుగా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా రూ.523 కోట్లు సమీకరిస్తున్నప్పటికీ.. రూ.450 కోట్లు తాజా ఈక్వీటీ షేర్లను విక్రయిస్తుండగా.. మిగిలిన మెుత్తానికి 15.61 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించారు.
4- ఇక మెయిన్ కేటగిరీలో వస్తున్న నాలుగో ఐపీవో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఫిబ్రవరి 7న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతున్న ఐపీవో రూ.462 కోట్ల తాజా ఈక్విటీ, 26.08 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తోంది. ఫిబ్రవరి 9న ముగుస్తున్న ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.393-414గా సెట్ చేయబడింది. దరఖాస్తు కోసం కనీస లాట్ పరిమాణం 36 షేర్లుగా ఉండగా.. ఇన్వెస్టర్లు కనీసం రూ.14,904 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది.
5- చివరిగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఆల్పెక్స్ సోలార్ ఐపీవో. ఇది దేశీయ పెట్టుబడిదారుల కోసం ఫిబ్రవరి 8న ప్రారంభం కానుంది. కంపెనీ ఇష్యూ ధరను రూ.115గా ఉంచగా.. మెుత్తం 64.8 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ఎవరైనా ఐపీవోలో పెట్టుబడి పెట్టి పాల్గొనాలంటే 1,200 షేర్లను కొనుగోలు చేయాలి. ఇందుకు రూ.1,38,000 కనీస పెట్టుబడి మెుత్తం అవసరం.


Click it and Unblock the Notifications