Samvat 2081: దేశీయ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చాలా మంది ఇన్వెస్టర్లకు దీపావళి రోజు జరిగే ముహురత్ ట్రేడింగ్ గురించి తెలియదు. ఇదే క్రమంలో దీపావళికి జరిగే గంట ట్రేడింగ్ సమయంలో ఏ కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేయాలని చాలా మంది ఇన్వెస్టర్లు చూస్తుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే..
వాస్తవానికి గత ఏడాది దీపావళి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ బుల్ ర్యాలీని కొనసాగించిన వేళ.. ఇన్వెస్టర్లు ఈ మధ్య కాలంలో భారీ రాబడులను అందుకున్నారు. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 25 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ సూచీ 47 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 45 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ క్రమంలో భలమైన విదేశీ పెట్టుబడుల ఇన్ ఫ్లో కనిపించింది. ప్రతి ఏటా మాదిరిగానే దీపావళి రోజున ప్రత్యేకంగా నిర్వహించే గంట ముహురత్ ట్రేడింగ్ ఈ ఏడాది నవంబర్ 1న జరగనుంది.ఇది సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు జరగనుంది. ఈ క్రమంలో చోలా సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లకు కొనుగోలు సూచించిన 5 షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్: కంపెనీ దేశంలోని ఒక అగ్రగామి ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ. 1940లో స్థాపించబడిన సంస్థ దేశంలో ఏరోస్పేస్ సామర్థ్యాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 11న కంపెనీ షేరు రూ.4,446.85 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీకి రూ.1.20 కోట్ల ఆర్డర్ బుక్ కలిగి ఉంది. FY25లో ఇప్పటివరకు దాదాపు రూ.26,000 కోట్లు గెలుచుకుంది. కంపెనీ ఖర్చుల హేతుబద్ధీకరణతో పాటు స్వదేశీ భాగాలను వినియోగించటంతో మంచి ఆపరేటింగ్ మార్జిన్ సాధించటానికి దోహదపడతాయని చోలా సెక్యూరిటీస్ పేర్కొంది.
IRCON ఇంటర్నేషనల్: కంపెనీ1976లో రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌గా స్థాపించబడింది. ప్రారంభంలో రైల్వే నిర్మాణంపై దృష్టి సారించిన కంపెనీ రైల్వేలు, హైవేలు, వంతెనలు, సొరంగాలు, మెట్రో వ్యవస్థలతో సహా వివిధ రంగాల్లో భారీ-స్థాయి, సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రాజెక్టులను నిర్వహించే సంస్థగా దేశంలో కార్యకలాపాలను నిర్వహించింది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.26,784 కోట్లతో బలంగా ఉంది. గత 5 సంవత్సరాలలో 16% CAGR వద్ద సమ్మేళనం లాభాన్ని కలిగి ఉంది. ప్రభుత్వం రైల్వేల కోసం ఖర్చు చేస్తున్న మౌలిక సదుపాయాల పెరుగుదల కంపెనీకి మేలు చేస్తుంది. ఇదే క్రమంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటులో భాగస్వామిగా కొనసాగుతోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ తన వ్యాపారంలో ఏడాదికి 12 శాతం వృద్ధిని సాధించింది. అలాగే క్యూ2లో బలమైన వ్యాపార పనితీరును ప్రదర్శించింది. అలాగే కంపెనీ రుణం కోసం డిపాజిట్ల మెరుగైన వినియోగాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా మెుదటి త్రైమాసికంలో రిటైల్, అగ్రి, ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో ఏడాది ప్రాతిపదికన 18.8 శాతం సగటు వృద్ధిని సాధించింది. Q1 FY25లో గమనించిన కంపెనీ Q2 FY25 కోసం అంచనా వేసిన బలమైన పనితీరుకు అనుగుణంగా ఉంది. అక్టోబర్ 11న రుణదాత షేర్లు రూ.105.50 వద్ద ట్రేడింగ్ ముగించాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: దేశంలోని ప్రజలందరికీ చేరువైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఏకైక ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. కంపెనీ మెుదటి త్రైమాసికంలో బలమైన వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో ప్రీమియంలలో 64 శాతం, పాలసీల్లో 66 శాతానికి పైగా వాటాలను కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయిలో ఎల్ఐసీ 14వ బలమైన ఇన్సూరెన్స్ సంస్థగా ర్యాంక్ అందుకుంది. ప్రస్తుతం కంపెనీ దేశంలో 8.5 కోట్ల ప్రజలకు తన ఇన్సూరెన్స్ కవరేజ్ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆటగాళ్లతో పోటీపడేందుకు, సేవలను మెరుగుపరిచేందుకు.. ఇన్ఫోసిస్‌తో కలిసి నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా DIVE అనే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లో ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది.
నారాయణ హృదయాలయ: ఆరోగ్య సంరక్షణలో ప్రధానంగా కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ సేవలను అందించటంలో నారాయణ హృదయాలయ పెద్ద పేరుగాంచింది. సూపర్ స్పెషాలటీ కంపెనీ షేర్లు అత్యుత్తమ విశ్వసనీయమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మార్కెట్లోని ఇతర ఆగటాళ్లతో పోల్చితే తక్కువ ధరలకు ఈ హాస్పిటల్ చైన్ వైద్య సేవలను అందిస్తోంది. రానున్న మూడు నాలుగేళ్లలో కెపాసిటీ విస్తరణకు అవసరమైన దాదాపు రూ.4,000 కోట్ల క్యాపెక్స్ ఖర్చులను చూసుకోవడానికి తగినంత బలమైన నగదు ప్రవాహాన్ని పొందుతోంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని హాస్పిటల్ చైన్ పరిగణిస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications