IPO News: దూసుకొస్తున్న 5 SME ఐపీవోలు.. గెట్ రెడీ ఇన్వెస్టర్స్.. పూర్తి వివరాలు
IPO News: నెలాఖరు వారంలో మార్కెట్లలో మళ్లీ ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఏకంగా 5 ఐపీవోలు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచుకుంటున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు వీటి వివరాలు తెలుసుకోవాలని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
- ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ట్రాన్‌స్టీల్ సీటింగ్ టెక్నాలజీస్ ఐపీవో అక్టోబర్ 30న ప్రారంభమౌతోంది. నవంబర్ 1న ఇది ముగుస్తుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.49.98 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. ఈ క్రమంలో 67.84 లక్షల షేర్ల తాజా ఇష్యూ ఉండగా రూ.2.49 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఇదే క్రమంలో ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.67-70గా కంపెనీ నిర్ణయించింది.

- బృందావన్ ప్లాంటేషన్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 30న ప్రారంభమవుతుంది. నవంబర్ 1, 2023న ముగుస్తుంది. కంపెనీ మార్కెట్ల నుంచి రూ.15.29 కోట్లను సమీకరించేందుకు 14.16 లక్షల తాజా షేర్లను ఇష్యూ చేస్తోంది. దీని ప్రైస్ ధరను రూ.108గా కంపెనీ ప్రకటించింది.
- అలాగే ఎస్ఎమ్ఈ కేటగిరీలో అక్టోబర్ 31న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతున్న ఐపీవో మిష్ డిజైన్స్. ఇది నవంబర్ 2న ముగుస్తుంది. మార్కెట్ల నుంచి రూ.9.76 కోట్లను సమీకరించేందుకు కంపెనీ 8 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. దీనికోసం ఒక్కో షేర్ ధరను రూ.122గా కంపెనీ నిర్ణయించింది.
- ఇక నవంబర్ 1న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తున్న ఐపీవో SAR టెలివెంచర్. ఇది నవంబర్ 3న ముగుస్తుంది. కంపెనీ 45 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ.24.75 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని నిర్ణయించింది. SAR టెలివెంచర్ తన ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.52- 55గా నిర్ణయించింది.
- చివరిగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి వస్తున్న ఐపీవో బాబా ఫుడ్ ప్రాసెసింగ్. ఇది నవంబర్ 3న తెరవబడి నవంబర్ 7న ముగుస్తుంది. దీని ద్వారా కంపెనీ రూ.33 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.72-76గా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications